Telugu News

దళిత బంధుకు నిధులు విడుదలపై మంత్రి పువ్వాడ హర్షం..

◆ ఖమ్మం జిల్లా చింతకాని మండలంకు మరో రూ. 100 కోట్లు విడుదల.

0

దళిత బంధుకు నిధులు విడుదలపై మంత్రి పువ్వాడ హర్షం..
◆ ఖమ్మం జిల్లా చింతకాని మండలంకు మరో రూ. 100 కోట్లు విడుదల.
◆ సీఎం కేసిఆర్ కి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు.
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-

దళిత బంధు పథకం అమలు కొరకు మరో రూ. 100 కోట్ల నిధులను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి సీఎం కేసీఆర్ విడుదల చేయడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. దళితుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే దళిత బంధు పథకం అమలు కు పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చింతకాని మండలంను సీఎం కేసీఆర్ ఎంపిక చేసి 100 కోట్ల నిధులు విడుదల చేసిన విషయం విదితమే. దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. అలాగే దళితబంధు పథకం అమలు విషయంలో జిల్లా కలెక్టర్ గ్రౌండ్ పనులు వేగవంతం చేయాలని కోరారు.

also read :- ద‌ళితులకు గుడ్ న్యూస్.. దళితబంధు నిధులు విడుదల