‘గాడ్‌ఫాదర్’మ్యూజిక్ పై నెటిజన్ల ఫైర్
== గని టైటిల్ సాంగ్ ను పోలి ఉందని విమర్శ
== సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
(సినిమా-విజయంన్యూస్)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా అంటే ఎలా ఉంటుంది.. ఆయన నటిస్తున్నాడంటే చాలు ఆ మూవీకి కాసుల వర్షం.. అభిమానులకు మనుసునిండా ఉప్పొంగే సంతోషం.. ఏడాది పాటు మర్చిపోని సంగీతం.. నెల మొత్తం సినిమా సందడే సందడి ఉంటుంది.. అందుకే అందులో పనిచేసే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు.. ఒక రకంగా చెప్పాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని చెప్పాల్సి ఉంటుంది.. అయితే అతి త్వరలో రాబోయే అతిపెద్ద సినిమా విషయంలో మాత్రం సంగీత డైరెక్టర్ పై నెటిజన్లు విమ్మర్శల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ సంగీతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో కొత్త సినిమా ‘గాడ్‌ఫాదర్’. ఖైదీ సినిమా తరువాత అంత పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తున్న మరో కొత్త చిత్రం ఇదే. ఖైదీ తరువాత అచార్య సినిమా వచ్చినప్పటికి ఆ సినిమా ప్రేక్షకుల మనసును అకట్టుకోలేకపోయింది.
ALLSO RAED- రాజమౌళి దర్శకత్వంపై ఆర్జీవీ సంచలన కామెంట్స్
ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. సల్మాన్‌ఖాన్ , దర్శకుడు పూరి జగన్నాథ్ అతిథి పాత్రలలో కనిపించనున్నారు. మోహన్ రాజాదర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.అయితే అసలు పంచాయతీ ఎంటంటే..?చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం గాడ్ పాదర్ సినిమా టైలర్ ను విడుదల చేశారు.కోట్లాది అభిమానుల ప్రేమతో విడుదల చేసిన ఈ టీజర్ అద్భుతంగా ఉందనే టాక్ వచ్చినప్పటి మరో వైపు విమర్శలు కూడ వస్తున్నాయి.. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మ్యూజిక్‌పై ట్రోలింగ్ నడుస్తుంది. ఈ సినిమా ట్రైలర్మ్ అచ్చం వరుణ్ తేజ్ నటించిన గని టైటిల్ సాంగ్‌లా ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తీరు మార్చుకోకుండా మక్కీకి మక్కీ దించేశాడంటూ తమన్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ సినిమాకు కూడా ఇలా కాపీ కొడతావా అంటూ నెటిజన్లు తమన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట వైరల్ చేస్తూ తమన్ తీరును ఎండగడుతున్నారు. కాగా గని సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చింది తమనే కావడం విశేషం. అయితే, తాజాగా చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రాబోతుందని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. దీనిలో ఆయన ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషాల్‌తో కలిసి ఉన్నారు. దీనిని బట్టి చూస్తే ’గాడ్ ఫాదర్’ మూవీలో ఓ అద్భుతమైన పాటను శ్రేయా ఘోషాల్‌తో పాడించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే, ఆమె తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఇక ఇప్పుడు ఈ ’గాడ్ ఫాదర్’ సినిమాలో పాడిన పాట ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా, భారీ స్థాయిలో అక్టోబరు 5న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆచార్య సినిమా ఆశించినంతగా విజయాన్ని అందుకో లేదు. దాంతో ఇప్పుడు ఎలాగైనా ’గాడ్ ఫాదర్’ సినిమాతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. తాజా టీజర్‌తో భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమాపై ఇప్పుడు వరుస అప్‌డేట్‌తో ఆ అంచనాలను రెట్టింపు చేయబోతున్నారు.
ALLSO RAED- చర్లలో మావోల ప్రజా కోర్టు