Telugu News

గణేష్ ఉత్సవ కమిటీకి ఎంతో చరిత్ర ఉంది : నామ

శోభాయాత్ర లో పాల్గొని ప్రారంభించిన ఎంపీ నామ

0

గణేష్ ఉత్సవ కమిటీకి ఎంతో చరిత్ర ఉంది : నామ నాగేశ్వరరావు

== శోభాయాత్ర లో పాల్గొని ప్రారంభించిన ఎంపీ నామ

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఖమ్మం గణేష్ నిమజ్జనోత్సవ కమిటీకి ఎంతో పూర్వ చరిత్ర ఉందని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత ఖమ్మం గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా బుధవారం ఖమ్మం గాంధీ చౌక్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొని, మాట్లాడారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో శోభయాత్రను ప్రారంభించిన మంత్రి

ఖమ్మం గణేశ్ ఉత్సవ కమిటీ ఎన్నో ఏళ్లుగా కుల,మత, పార్టీలకతీతంగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహిస్తూ, ప్రజలందర్నీ సమన్వయ పరుస్తూ ముందుకెళుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసి, క్షేమంగా అంతా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అందరూ బాగుండాలని, ఆ దేవుని కృప అందరిపై ఉండాలని నామ అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ వారితో పాటు రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీవైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, నాయకులు సుధాకర్ చారి , చిత్తారు సింహాద్రి యాదవ్, మోరంపూడి ప్రసాద్, నామ సేవా సమితి నుంచి పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్, కాళేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- పాలేరులో బీఆర్ఎస్ గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ