Telugu News

గంగబండతండ పంచాయతీ ట్రాక్టర్ బయట పనులకు 

0

గంగబండతండ పంచాయతీ ట్రాక్టర్ బయట పనులకు 

== పట్టించుకుని అధికారులు
కూసుమంచి, నవంబర్ 5(విజయంన్యూస్)
పంచాయతీ ట్రాక్టర్ ను బయట పనులకు ఉపయోగించకూడదని గతంలో అనేక సార్లు ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికి పంచాయతీల్లో మార్పు రావడం లేదు.. అలాంటి విషయంలో పలు పంచాయతీల సర్పంచులకు, కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికి కొంత మందికి మార్పు రావడం లేదు.  కూసుమంచి మండలంలోని గంగబండతండ పంచాయతీ ట్రాక్టర్ ఇతర పనులకు ఉపయోగిస్తున్నట్లు గతంలో అనేక సార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికి అధికారులు పట్టించుకోకపోవడంతో అక్కడ పరిస్థితి మారలేదు. శనివారం పంచాయతీ ట్రాక్టర్  ఇతర పనులకు ఉపయోగించిన పరిస్థితి కనిపించింది. పంచాయతీ ట్రాక్టర్లో వరలు తీసుకెళ్తుండగా   ఓ బాటసారి పోటో తీసి మీడియాకు పంపించారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా విద్యుత్ శాఖ వారు ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేసేందుకు ట్రాక్టర్లో వరలు తీసుకెళ్లారని, ఆ విసక్ష్ం నాకు తెలియదని అన్నారు. మరో సారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని అదికారులు తెలిపారు.