Telugu News

ఎఫ్ఆర్వో కుటుంబానికి వద్దిరాజు రూ. 2 లక్షల ఆర్థిక సాయం

శ్రీనివాస్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించిన గాయత్రి రవి

0

ఎఫ్ఆర్వో కుటుంబానికి వద్దిరాజు రూ. 2 లక్షల ఆర్థిక సాయం

== శ్రీనివాస్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించిన గాయత్రి రవి

ఖమ్మం, నవంబర్, 23(విజయంన్యూస్):

ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బాసటగా నిలిచారు. కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా రూ. 2 ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈర్లపుడి లో జరిగే ఎఫ్ఆర్వో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంత్రులతో కలిసి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా రవిచంద్ర ఖమ్మం చేరుకున్నారు. ఈర్లపుడిలోని శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం నుంచి అందించే సాయంతో పాటు వ్యక్తిగతంగా తాను కూడా బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఎంపీ బావించారు. దీంతో రూ. 2 లక్షల రూపాయలను మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి ల చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు ఇప్పించారు. ప్రభుత్వ సాయానికి తోడు వ్యక్తిగతంగా ఆదుకున్న ఎంపీ రవిచంద్ర ను మంత్రులు అభినందించారు. అనంతరం ఆయన మంత్రులతో కలిసి శ్రీనివాసరావు పాడె మోసి అంతిమ వీడ్కోలు పలికారు.

ఇదికూడా చదవండి: గుత్తికోయలు వర్సెస్ ఫారెస్ట్ అధికారులు