Telugu News

ఘనంగా గాయత్రి రవి పుట్టిన రోజు వేడుకలు

- తలసేమియా రోగుల కోసం అభిమానుల రక్తదానం - పలు చోట్ల సేవా కార్యక్రమాలు - మంత్రి అజయ్, ఎమ్మెల్సీ మధు తదితరుల హాజరు

0

ఘనంగా గాయత్రి రవి పుట్టిన రోజు వేడుకలు

– తలసేమియా రోగుల కోసం అభిమానుల రక్తదానం
– పలు చోట్ల సేవా కార్యక్రమాలు
– మంత్రి అజయ్, ఎమ్మెల్సీ మధు తదితరుల హాజరు

(ఖమ్మం – విజయంన్యూస్):- 

జనవరి, 24: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పుట్టిన రోజు వేడుకలు ఖమ్మంలోని ఆయన నివాసంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు మంత్రి పువ్వాడ, గాయత్రి రవి లను భారీ గజ మాలతో సత్కరించారు. తలసేమియా రోగుల కోసం అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన యువకులను మంత్రి అజయ్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో మంత్రి తో పాటు నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇంచార్జీ ఆర్జేసి కృష్ణ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.

also read :- తేజ ట్రేడర్స్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ పొంగులేటి

ప్రముఖుల శుభాకాంక్షలు..

గాయత్రి రవి పుట్టిన రోజు సందర్భంగా పలువురు వ్యాపార, రాజకీయ, సామాజిక ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సృజనారాణి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, బిల్డర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు కొప్పు నరేష్ కుమార్, షిర్డీ సాయి దేవాస్థాన చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు, మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల గాంధీ, శెట్టి రంగారావు, జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, కోశాధికారి జాబిశెట్టి శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్, గ్రానైట్ అసోసియేషన్ నాయకులు పాటిబండ్ల యుగంధర్, పీసీసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు లింగాల రవికుమార్ తదితరులు ఉన్నారు.

also read :- గైగొళ్లపల్లికే వన్నె తెచ్చిన సర్పంచ్