Telugu News

ఆరుగురి ఎన్నికను గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల**

_రాజ్యసభ సభ్యత్వానికి నేడు బండా ప్రకాశ్‌ రాజీనామా**

0

ఆరుగురి ఎన్నికను గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల**

_రాజ్యసభ సభ్యత్వానికి నేడు బండా ప్రకాశ్‌ రాజీనామా**

(హైదరాబాద్‌– విజయం న్యూస్):-

శాసన సభ్యుల కోటాలో ఇటీవల శాసన మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల ఎన్నికను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత జూన్‌ 3న ఆరుగురు ఎమ్మెల్యే కోటా శాసన మండలి సభ్యుల పదవీ కాలపరిమితి పూర్తికాగా వారి స్థానంలో నవంబర్‌ 22న ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు.

తాజాగా ప్రజాప్రాతినిథ్యం చట్టం లోని నిబంధనల మేరకు వీరు ఎన్నికైనట్లు గెజిట్‌ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో మండలికి ఎన్నికైన వారిలో కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కల్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్‌రాంరెడ్డి, బండా ప్రకాశ్‌ ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ మండలికి ఎన్నికైన నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన 14 రోజుల్లో రాజ్యసభకు రాజీనామా చేయాలనే నిబంధన మేరకు గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బండా ప్రకాశ్‌ చెప్పారు.

ఆరుగురిలో ఐదుగురు..

ఇటీవల మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు గురువారం ఉదయం 11 గంటలకు ప్రొటెమ్‌ చైర్మన్‌ భూపాల్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్‌రాంరెడ్డి, తక్కల్లపల్లి రవీందర్‌రావు గురువారం ప్రమాణం చేస్తారు. బండా ప్రకాశ్‌ తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ప్రమాణం చేస్తారు.

గవర్నర్‌ కోటాలో ఎన్నికైన మధుసూధనాచారితోపాటు బండా ప్రకాశ్‌ ఈ నెల 6 తర్వాత ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదిలాఉంటే స్థానిక సంస్థల కోటాలో వచ్చే ఏడాది జనవరి 4న 12 మంది సభ్యుల పదవీ కాల పరి మితి ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 12 స్థానాలనుగాను ఇప్పటికే ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరో ఆరు స్థానాలకు ఈ నెల 10న పోలింగ్‌ జరగనుంది. జనవరి 4 తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఎన్నికయ్యే 12 మంది పదవీ ప్రమాణం చేస్తారు.

also read ;- *దాన్యం కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే సండ్రా కు సీఎం నుంచి ఫోన్ కాల్…