Telugu News

ఏన్కూరులో విజృంభిస్తున్న జెమిని వైరస్

- మిరప తోటల్ని తొలగిస్తున్న రైతులు

0

ఏన్కూరులో విజృంభిస్తున్న జెమిని వైరస్

– మిరప తోటల్ని తొలగిస్తున్న రైతులు

ఏన్కూరు, అక్టోబర్ 8(విజయం న్యూస్):

మిరప తోటలపై జెమినీ వైరస్(గుబ్బరోగం) విజృంభిస్తున్నది. దీంతో రైతులు చేసేదేమీ లేక మిరప తోటల్ని తొలగిస్తున్నారు. ఈ ఏడాది మండలంలో సుమారు పదివేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మిర్చికి గిట్టుబాటు ధర వస్తుండడంతో రైతులు మిర్చి సాగు విస్తీర్ణాన్ని పెంచారు. ఇప్పటివరకు ఎకరానికి సుమారు 70 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ప్రధానంగా మిరప జెమినీ వైరస్ సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైరస్ సోకిన మిరపతోటల్ని తొలగించడం వల్ల ఎకరానికి లక్ష రూపాయల వరకు నష్టం వాటిలినట్లు రైతులు వాపోతున్నారు. మళ్లీ మిరప తోటలను సాగు చేస్తున్నామని దీనివల్ల అదనంగా భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండల వ్యవసాయ అధికారులు మిరప తోటలని పరిశీలించి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నివారణ చర్యలను వివరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏన్కూరులో ఆశా వర్కర్ల వంటావార్పు