Telugu News

యువత పోటీ పరీక్షలకు సిద్దంగా ఉండండి

తెలంగాణ ప్రభుత్వం మస్తు ఉద్యోగ ప్రకటనలేసింది

0

యువత పోటీ పరీక్షలకు సిద్దంగా ఉండండి

== తెలంగాణ ప్రభుత్వం మస్తు ఉద్యోగ ప్రకటనలేసింది

== బీసీ స్టడీ సర్కిల్ ను ప్రారంభిస్తున్న సందర్భంగా మంత్రులు గంగుల, పువ్వాడ యువతకు పిలుపు

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-

జిల్లాల్లో బి.సి యువతకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు, ఉద్యోగ అవకాశలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బి.సి స్టడీ సర్కిలను ఏర్పాటు చేసిందని, అందుకు గాను యువత పోటీ పరీక్షలకు సిద్దంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్లు పేర్కొన్నారు. శనివారం ఖమ్మం నగరం తెలంగాణ తల్లి సర్కిల్ లో రూ.3 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించిన బి.సి. స్టడీ సర్కిల్ భవాన్ని శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ,జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి మంత్రులు ప్రారంభించారు.

also read;-విద్యార్థులను ఆలోచింపజేసీన సాహిత్యవేత జూలూరు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ బి.సి కులాలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కె.తారకరామారావు జిల్లా అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుతో పాటు అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగిందని మంత్రి తెలిపారు. బి.సి కులాలకు అన్ని విధాలుగా ఉపయోగపడేందుకు మరో రెండు కోట్లతో బి.సి భవనాన్న నిర్మించుకోవడం జరుగుతుందని, రాబోయో రోజుల్లో కమ్యూనిటీ హల్, శుభకార్యాలు, స్కిల్స్ డెవలప్మెంట్ మెరుగుపర్చుకునేందుకు హబ్ తరహాలో సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.

also read;-వలస కార్మికులకు అండగా ఉంటాం: ఎండీ.జావిద్

ప్రయివేటు భవనంలో నిర్వహించబడుతున్న బి.స. స్టడీ సర్కిల్ సెంటర్‌ను పూర్తిగా నేడు మనం నిర్మించుకున్న బి.సి.
స్టడీ సర్కిల్ భవనంలోకి మార్చడం జరిగిందిని, పోటీ పరీక్షలకు కావల్సిన పుస్తకాలు, బోధకులను సమకూర్చడం జరిగిందని దీన్ని బి.సి యువత సద్వినియోగపర్చుకొని పూర్తి స్వేచ్ఛతో ఎంత సమయమైన కష్టపడి చదివి ఉద్యోగాలు పొందాలని మంత్రి ఆకాంక్షించారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ బి.సి.ల సంక్షేమానికి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె.చంధ్రశేఖర్ రావు పెద్ద పీట వేసారని, అగ్రవర్ణాలతో సమానంగా బి.సి యువత ఉన్నత విద్యనభ్యసించి అన్ని రంగాలలో రాణించాలనే సంకల్పంతో రాష్ట్రంలో గతంలో ఉన్న 19 గురుకులాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేడు 281 బి.సి గురుకులాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని నేడు బి.సి గురుకులాల్లో లక్షా 58 వేల మంది విద్యార్థులు నభ్యసించడం జరుగుతుందన్నారు. గతంలో ఎక్కడ ప్రభుత్వం యువతకు స్టడీ సర్కిల్ నిర్వహించింది లేదన్నారు.

also read;-ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన యువకుడు

మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కార్పోరేటు స్థాయి స్టడీ సర్కిల్లకు ధీటుగా నేడు ప్రభుత్వం అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రభుత్వం స్టడీ సర్కిలను నిర్మించుకోవడం జరిగిందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మనకు కల్పించిన ఈ సువర్ణ అవకాశాన్ని బి.సి యువత నేడి నుండే సద్వినియోగపర్చుకొని గ్రూప్-1, అన్ని ఉద్యోగాలకు యువత పోటీపడి జిల్లా నుండి ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలన మంత్రి కోరిరు. నేడు ఉద్యోగాల సాధనలో ఇంటర్యూలు లేవని, పైరవీలకు తావులేదని మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగల కల్పనకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుట్టారని మంత్ర తెలిపారు.

also read;-మా మాటే వేదం..? వినకపోతే కుల బహిష్కరించుడే
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో బి.సి యువతకు పోటీ పరీక్షలకు, ఉద్యోగ సాధనకు 3 కోట్ల 50 లక్షల అంచనాతో నిర్మించిన బి.సి స్టడీ సర్కిల్ భవనంలో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, అడ్మిన్ బ్లాక్, లెక్చర్ హాల్స్, స్టడీ రూమ్స్, డైనింగ్ హాల్, డార్మటరీతో ఆర్. అండ్. బి శాఖ ద్వారా నిర్మించడం జరిగిందని, ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యేందుకు అన్ని స్టడీ మెటీరియల్స్, బోధకులు, మంచి వాతావరణంలో సాధ్యమైనంత మేరు కష్టపడి చదువుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందని బి.సి యువత సద్వినియోగపర్చుకొని ఉద్యోగాలను పొందాలని కలెక్టర్ తెలిపారు.

also read;-కాంట్రాక్టర్ మీకు ఇది తగునా..!
కార్యక్రమంలో డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చువిజయ్ కుమార్, ఖమ్మం వ్యవసాయ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, బి.సి స్టడీ సర్కిల్ కో-ఆర్డినేటర్ శ్రీలత,జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధకారి జ్యోతి, కార్పోరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.