Telugu News

ఘనంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం : జెడ్ పి టి సి సున్నం నాగమణి

== పార్టీకి,నాయకుల మధ్య కార్యకర్తల బలం.

0

ఘనంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం : జెడ్ పి టి సి సున్నం నాగమణి
== పార్టీకి,నాయకుల మధ్య కార్యకర్తల బలం.
== క్రమశిక్షణ గల పార్టీలో ఉండటం నా అదృష్టం గా భావిస్తున్నాను.
== 2023 లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుదాం.
== కాంగ్రెస్ సీనియర్ నాయకులను సన్మానించిన కార్యకర్తలు.
(ములకలపల్లి -విజయం న్యూస్ )
ఏఐసిసి పిలుపుమేరకు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పెద్దల ఆదేశాల మేరకు 137 వ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు… ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శాడియం బక్కులు, మేడిశెట్టి సూరయ్య, వనమా వెంకయ్య లను ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది…. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత కలిగి ఉంటారని పార్టీ ఆదేశాలు మేరకు తూచా తప్పకుండా,పార్టీ అధ్యక్షుడు నుండి సామాన్య కార్యకర్తల వరకు కూడా పాటిస్తారని, అదే కాంగ్రెస్ పార్టీకి బలమని తెలియజేశారు…

రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులను మోసగిస్తూ వాళ్ల స్వలాభం కోసం రైతులు పేరున దీక్షలు, ర్యాలీలు చేస్తూ రైతులను అయోమయంలో నెట్టి పడేస్తున్నారు… 2023 లో జరిగే ఎలక్షన్ లో సమిష్టిగా ముందుకు సాగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని, ఆ బాధ్యత ప్రతినాయకుడి ది, ప్రతి కార్యకర్త కూడా ముందుకు సాగి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని తెలిపారు… ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెట్టేటి నరసింహారావు, సభ్యత్వ ఇంచార్జ్ తాండ్ర ప్రభాకర్ రావు, అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరం పల్లి చెన్నారావు, అసరా పేట యూత్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్, కిసాన్ సెల్ ప్రెసిడెంట్ అర్చన వెంకటేశ్వర్లు, మైనార్టీ సెల్ అధ్యక్షులు అంజుమ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖాదర్, పాలకుర్తి రత్న భూషణం, మిరియాల వెంకటేశ్వర్లు, పుప్పాల హనుమంతురావు, బుగ్గారపు సత్యనారాయణ, కో ప్పుల రాంబాబు, తాండ్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

also read:-కూలీలతో వెళ్తున్న ఆటో లారీ ఢీ….

 

 

please subscribe this chanel smiling chaithu