Telugu News

ఆడపిల్లల జనాబా నిష్పత్తి తగ్గిపోవ టానికి కారణం ఏమిటి..?

భ్రూణ హత్యలను నియంత్రించే చట్టాలపై అవగాహన లేమి..!

0

లింగ వివక్ష ఇలా..భవిష్యత్ ఎలా..?

*ఆడపిల్లలకి తల్లి గర్భంలోనూ తప్పని అనాధరణ

*ఆడపిల్లల జనాబా నిష్పత్తి తగ్గిపోవ టానికి కారణం ఏమిటి..?

*భ్రూణ హత్యలను నియంత్రించే చట్టాలపై అవగాహన లేమి..!

(మహబూబాబాద్ విజయం న్యూస్)

నేటి సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానమే. స్త్రీ పురుషుల మధ్య ఏ వివక్ష ఉండకూడదు. నిజానికి పురుషుడి కంటే స్త్రీ ఏ విషయంలోనూ తక్కువ కాదు అందుకే ఈ నాడు అన్ని రంగాలలోనూ స్త్రీలు పురుషులతో పోటీ పడుతున్నారు. అయినా మన సమాజంలో ఆడశిశువుల పట్ల అనాదరణ ఇంకా తగ్గలేదు. పుట్టబోయేది ఆడ శిశువు అని తెలియగానే ఒక్కోసారి గర్భస్రావానికి కొన్ని కుటుంబాలు సిద్ధపడడం మనం నిత్యం అనేక చోట్ల పేపర్లలో టీవీ లలో చూస్తున్నాం .

నేటి మహిళలు రాకెట్ స్పీడుతో రోదసి వైపు దూసుకు పోతున్నారని, ఆర్దిక, సామాజిక, రాజకీయ- ఇది అది అని కాదు అన్ని రంగాలలో ముందుకు వెలతున్నారని ఓ వైపు గర్వంగా చెప్పుకుంటున్నాం. అదంతా నాణేనికి ఒక వైపు. మరో వైపు చూస్తే..?, ఆమె బతికి ఉండగానే కాల్చి బుగ్గి చేసేస్తున్నాం . అమ్మ కడుపులో నవమాసాలు నిండి ఈ లోకం లోకి అడుగుపెట్టకుండానే అమానుషంగా చిదిమేస్తున్నాం. పితృస్వామ్య భావజాలం నరనరాల్లోనూ జీర్ణించుకున్న మనలో ఇంకా ఆడపిల్ల అంటే చిన్న చూపే . ఆమె పుట్టుకకు, ఎదుగుదలకు, అభివృద్దికి అన్నీ అవరోధాలే. ఆమె, అమ్మ కడుపులో ఉండగానే ఈ వివక్షతకు లోనవుతోంది. పుట్టేహక్కును కోల్పోతోంది. పుట్టినా జీవించే హక్కును కోల్పోతోంది. అందుకు కారణం ఎవరు? మనం ఎవరిని నిందించాలి? ప్రజలనా..? పాలకులనా..? మన విశ్వాసాలనా..? నమ్మకాలనా..? అమలు కాని చట్టాలనా..? ఎక్కడో ఒక చోట ఈ చట్టాలను కటినంగా అమలు చేస్తున్నా ఇంకా ప్రజల్లో మార్పు రాకపోవడం గమనార్హం
మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలు పూర్తిగా అమలు కాకపోవడం,ఆధునిక అజ్ఞానం ప్రస్తుత చట్టాల అసహాయత, సంప్రదాయాలు – ఆచార వ్యవహారాలు పేరుతో సాగే ఆడ – మగ వ్యత్యాసాలు, మూడ నమ్మకాల్లోంచి వచ్చిన అనాచారాలు, అజ్ఞానం, ఇవన్నీ కలిసి ఆడపిల్ల అంటే ఉన్న చిన్న చూపు, ఆమె అంటే ఉన్న నిర్లక్ష్యం వల్లే ఆమె చేసే పనికి తక్కువ విలువ కట్టడం, ఆమెను కని ఎంతో ఖర్చు చేసి పెంచినా ఆమె బాధ్యత గతంలోలా తీరకపోవడం, పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్ళినా అక్కడ భద్రత లేకపోవడం వంటివన్నీ కారణాలే అని చెప్పుకోవచ్చు. కారణాలేవైనా కానీయండి ఆడపిల్ల పుట్టకముందే, లోకం పోకడ తెలియక ముందే తల్లి గర్భంలో ఉండగానే వివక్షతకు గురవుతోంది. అది ఆమె గిట్టే వరకూ కొనసాగుతూనే ఉంది.
ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఆడ శిశువుల కంటే మగశిశువులు ఎక్కువ. కానీ మనదేశంలో ఆ పరిస్థ్తితి అందుకు భిన్నం.రోజు రోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పరీక్షా కేంద్రాలు వాటి మాటున జరిగే అమానవీయ దుశ్చర్యలు వీటిని నిరోధించలేని పాలకులు,చట్టాలు, వెరసి ఆడపిల్లల జనాబా నిష్పత్తి తరిగి పోవటం.
చట్టాలు ఉండగానే సరిపోతుందా …? వాటి అమలు మాటేమిటి ? వాటి పట్ల ప్రజలలో చైతన్యం తీసుకురావలసిన అవసరం లేదా అనే వాదన కూడా వినిపిస్తోంది మరోవైపు ఇప్పటికైనా ప్రభుత్వాలు సమాలోచన చేయాలి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కానింగ్ కేంద్రాలను నియంత్రించాలి ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కటిన చట్టాలు అమలు చేయాలి అప్పుడే లింగ నిర్ధారణ బ్రూన హత్యలను నిరోధించగలము,నియంత్రించ గలము అని విశ్లేషకుల అభిప్రాయం.

also read :- రోలర్ని తగలబెట్టిన మావోయిస్టులు