Telugu News

పగిడిపల్లి నాగేశ్వరరావు ఇంటికి కరెంట్ ఇవ్వండి: కే.వీ

విలేకరుల సమావేశంలో డాక్టర్ కేవీ. కృష్ణా రావు

0

పగిడిపల్లి నాగేశ్వరరావు ఇంటికి కరెంట్ ఇవ్వండి: కే.వీ
* విలేకరుల సమావేశంలో డాక్టర్ కేవీ. కృష్ణా రావు
ఖమ్మం మే 3 (విజయం న్యూస్):

నగరం లోని రామచంద్రయ్య ప్రాంతం లోని పగిడి పల్లి నాగేశ్వరావు ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని తెలంగాణా ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి. కృష్ణా రావు డిమాండ్ చేశారు. శుక్ర వారం ఖమ్మం లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ ఎస్ పి టేకుల పల్లి 2 కాల్వ ల ప్రాంతం పై ( రామచంద్రయ్య నగర్ ) గుడిసెలు వేసుకుని పేదలు జీవిస్తున్నారని , ఆ పేద ప్రజలకు మౌళిక వసతులు కల్పించాలి అన్నారు.

ఇది కూడా చదవండి:- మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రధాని: పొంగులేటి 

కరెంట్ మీటర్ ఉండగా విద్యుత్ అధికారులు ఎలాంటి నోటీసులు జారి చేయకుండా ఆ మీటర్ నూ తొలగించడం తో… ఈ వేసవిలో కరెంట్ లేకపోవడం మూలంగా వారు తీవ్రతిబ్బందులు ఎదుర్కొంటున్నా అదికారులు పట్టించు కొక పోవడం దారుణమన్నారు. ఉద్యమ కారులు రాంబాబు, బాసాటి మాట్లాడుతూ అధికారుల వైఖరి సంజసంగా లేదని చెప్పారు. కరెంట్ మీటర్ ఉండగా తొలగించడం ఎందుకని ప్రశ్నించారు. తొలగించిన తరువాత మీటర్ పెట్టడానికి అభ్యంతరాలు ఎందుకు అన్నారు. ఎస్ సి, ఎస్టీ , బీసీ ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ భూక్యా ఉపేంద్ర బాయి , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాణోతూ బద్రు నాయక్ మాట్లాడుతూ నాగేశ్వరరావు ఇంటి కరెంట్ కనెక్షన్ ను పునరుద్ధరించాలని సూచించారు , రజక సంఘం నాయకుడు రేగళ్ల సీతారాములు లు మాట్లాడుతూ కరెంట్ మీటర్ ను తొలగించి తప్పు చేసిన అధికారులు తమ తప్పును సరి చేసుకునేందుకు మరో అవకాశం గా వెంటనే తొలగించిన స్థానంలోనే కరెంటు మీటర్ను తక్షణం బిగించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పైసల ఐక్యవేదిక చైర్మన్ షేక్. నజీమా , దామల రవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- ఆదరించండి..అధిక మెజారిటీ అందించండి: రఘురాంరెడ్డి