Telugu News

శీనన్న కంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వండి: ప్రసాద్ రెడ్డి

పొంగులేటి ప్రసాద్ రెడ్డి తో కలిసి రఘురాం రెడ్డి ప్రచారం 

0
శీనన్న కంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వండి: ప్రసాద్ రెడ్డి
==మద్దులపల్లి, గుర్రాలపాడు లో ఓట్ల అభ్యర్థన..
==  పొంగులేటి ప్రసాద్ రెడ్డి తో కలిసి రఘురాం రెడ్డి ప్రచారం 
(ఖమ్మం రూరల్-,విజయం న్యూస్):
 కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డితో కలిసి మండలంలోని మద్దులపల్లి, గుర్రాలపాడు గ్రామాల్లో గురువారం సాయంత్రం సీపీఐ, సీపీఎం బలపరిచిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి ప్రచారం చేశారు. పొంగులేటి కుటుంబం అంటే ఎంత విశ్వసనీయత ఉందో.. అందరికీ తెలుసని.. వారు, జిల్లా మంత్రులు,  రాజ్యసభ సభ్యురాలి తో కలిసి ఎంపీ గా తన విధులు సమర్థంగా నిర్వహిస్తానని అన్నారు.
== పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..* ప్రజాసేవ కోసం పోటీ చేస్తున్న రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శీనన్న కుటుంబం అందరికీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుడులా పనిచేసి పల్లె పల్లె నా ముమ్మర ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, నాయకులు తమ్మినేని నవీన్, భద్రకాళి, సీపీఎం, సీపీ ఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.