Telugu News

ఒక్క అవకాశం ఇవ్వండి: రాయల

ఏఐసీసీ అధ్యక్షుడు  ఖర్గే ను కలిసిన రాయల

0
ఒక్క అవకాశం ఇవ్వండి: రాయల
== ఏఐసీసీ అధ్యక్షుడు  ఖర్గే ను కలిసిన రాయల
(కూసుమంచి -విజయం న్యూస్)
పదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేశానని, కార్యకర్తలు, నాయకులకు అండగా ఉన్నానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక్క అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ని టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు కోరారు. సీట్లు కేటాయింపు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ కి వెళ్లిన రాయల నాగేశ్వరరావు ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన్ను శాలువా తో సత్కరించారు. గత పదేళ్ళపాటు   పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తాను చేసిన కృషిని ఆయనకు వివరించారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలకు అండగా ఉన్నానని రాబోయే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి,కాంగ్రెస్ పార్టీ నుండి తనకు టికెట్ కేటాయించాలని మల్లిఖార్జున ఖర్గే ని ను నాగేశ్వరరావు కోరారు..