Telugu News

గ్లోబల్ రెయిన్ బో స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం

గ్లోబల్ రెయిన్ బో స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం

0

గ్లోబల్ రెయిన్ బో స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం

కూసుమంచి మండల కేంద్రంలో గ్లోబల్ రెయిన్ బో పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.శ్రీనివాస రామానుజన్‌ చిత్రపటానికి పాఠశాల కరస్పాడెంట్ ఇర్షాద్ అహ్మద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణితం అంటే కొంతమంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారని కానీ, ఇష్టపడి చదివితే లెక్కలు నేర్చుకోవడం ఎంతో సులభమన్నారు. భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరిగా నిల‌వ‌టం మ‌న దేశానికే గ‌ర్వకారణం అన్నారు. చిన్న వయసులోనే గణితశాస్త్రంతో అనుబంధం ఏర్పర‌చుకున్న రామానుజ‌న్ గణితంలో అసాధార‌ణ‌ ప్రతిభ కనపరిచేవాడ‌ని, ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన ఘ‌నుడ‌ని అభివ‌ర్ణించారు. రామానుజన్ లాంటి మహనుభావులను స్మరించుకుంటూ వారి అడుగుజాడలలో నడవాల్సిన బాధ్యత నేటి త‌రంపై ఉంద‌ని అన్నారు. ఈ సందర్భంగా గణిత నమునాలు ,క్విజ్ పోటీలు నిర్వహించారు. 1729 నంబర్ అకారంలో విద్యార్థులు కూర్చొని నివాళి అర్పించారు. స్క్వేర్, రియాక్టంగిల్ ఆకారంలో విద్యార్థులు కూర్చొని ప్రదర్శించారు. ఎస్ ఏ -1లో ఏడవ తరగతి విద్యార్థిని భువన శ్రీకి గణితంలో ఎనభై మార్కులు రావడంతో బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

also read;-బుల్లెట్ పై ప్రజల వద్దకు మంత్రి అజయ్.