ఘనంగా సుదర్శన చక్ర ప్రతిష్ఠా మహోత్సవం.
(ఏన్కూరు విజయo న్యూస్): –
మండల పరిధిలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం ఆలయ శిఖర సుదర్శన చక్ర కలశ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఉదయం నుంచే సుప్రభాతం, యాగశాల ఆరాధన ,సుదర్శన మూల మంత్రం హవనం, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి.ఉదయం ఎనిమిది గంటల 55 నిమిషాలకు చిత్త నక్షత్రయుక్త మిధున లగ్న పుష్కరాంశ సుముహూర్తము న మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి ఆలయ శిఖర సుదర్శన చక్ర ప్రతిష్టా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
also read;-పలు డివిజన్లలో అకస్మీక తనిఖీలు చేసిన మేయర్, కమీషనర్
దేవాలయానికి 80 వేల రూపాయల విలువైన సుదర్శన చక్రాన్ని కొనిజర్ల వాస్తవ్యులు దొరబాబు దంపతులు బహూకరించారు. 42 వేల రూపాయల వ్యయంతో యాగశాల నిర్మాణం చేయించారు. సుమారు 20 వేల రూపాయలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు, దేవాలయం వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొరబాబు దంపతులతో పాటు, ఏనుకూరు సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, సర్పంచ్ భూక్యా కాంతి, దేవస్థానం ధర్మకర్త మద్దికుంట నరసింహారావు, ఈవో సూర్యప్రకాశరావు,ఏఎంసీ మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్, ఉప సర్పంచ్ పటాన్ మజీద్ ఖాన్ ,భూక్యా బాలాజీ, వర శంకర ప్రసాద్, ఆలయ అర్చకులు నాగరాజా ఆచార్యులు, వేణుగోపాలాచార్యులు, కిరణ్ చార్యులు,రామకృష్ణమాచార్యులు, వేదాంత పవన్ చార్యులు, రామాచారి, పరిసర మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.