Telugu News

‘గో’ బ్యాక్.. అక్రమ చొరబాటుదారులపై తిరగబడాలి.

ఏజెన్సీలో పీసా గ్రామ సభ తీర్మానమే అంతిమ తీర్పు.

0

‘గో’ బ్యాక్.. అక్రమ చొరబాటుదారులపై తిరగబడాలి.

== ఏజెన్సీలో పీసా గ్రామ సభ తీర్మానమే అంతిమ తీర్పు.

== నూతన ఒరవడికతో ఏఎన్ఎస్ పోరు సాగించాలి.

== 1/70కి, పీసా కు లోబడి పాలన చేయాలి.

== ప్రశ్నించడం అలవాటుచేసుకోవాలి.

== ఇసుకలో 50% వాటా ఇవ్వాలి.

నూగురు వెంకటాపురం/జనవరి 9/విజయం న్యూస్:-
వలస వచ్చిన గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతం వదిలి వెళ్లిపోవాలని ఆదివాసి నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డ్ నుండి వేప చెట్టు జంక్షన్ వరకు వేల సంఖ్యలో ఆదివాసులు లాంగ్ మార్చ్ ను సోమవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆదివాసి నృత్యాల ద్వారా నిరసన తెలియపరిచారు. గో బ్యాక్ నాన్ ట్రైబ్ అంటూ మండల కేంద్రంలో తుడుం మోగించారు. భారత రాజ్యాంగ నిర్మాతకు పూలమాలలు వేసి ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన బహిరంగ సభను ప్రారంభించారు. ఈ సభ ఆదివాసి నవనిర్మాణ సేన రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు వాసం నాగరాజు అధ్యక్షతన జరిగింది.

allso read- పాలేరు ప్రజలకు ‘షర్మిళ’ బంపర్ ఆఫర్

ఆదివాసి విద్య ఫౌండేషన్ కన్వీనర్ వర్ష ముద్ధ రాజు, ఆదివాసీ సీనియర్ నాయకుడు ముర్రం వీరభద్రం తో పాటు పలువురు ఆదివాసి అడ్వకేట్లు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఏళ్ల తరబడి అణచి వేతకు గురైన బాధ నుండి ఉద్భవించినదే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల తిరుగుబాటు అన్నారు. ఆదివాసి ప్రజానీకం అంతా ఐదు, ఆరు షెడ్యూల్ లో ఉన్న రాజ్యాంగ హక్కులను  తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో విద్య, వైద్యం లేని ఆదివాసి పల్లెలు కో కొల్లలుగా ఉన్నాయన్నారు. రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసమే ఆశ్రయిస్తారని చెప్పారు.వారు మన హక్కులు, మన చట్టాలు గూర్చి చెప్పిన రోజులు ఉన్నాయా? అంటూ ధ్వజ మెత్తారు. ఆదివాసీలు సహృదయులు, అమాయకులు అన్నారు. రాజకీయ నాయకుల మోచేతి నీళ్లు తాగే కుర్దు పటేళ్లు ఉన్నారు కాబట్టే అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. భావితరాలకు అక్షర ఆయుధాన్ని అందించాలన్నారు. బ్రతుకులు మారాలంటే, స్వయం పాలన రావాలంటే ఓటే ఆయుధ మనీ తెలిపారు. ఆ ఓటును సరైన మార్గంలో నడిపించే జ్యోతి గా ఆవిర్భవించాలన్నారు. మన్యం ప్రాంతం అడవి బిడ్డల రాజ్యమని అన్నారు. అటవీ హక్కు పత్రాల పేరుతో ఆదివాసులను మోసం చేస్తున్నది ప్రభుత్వాలేనని మండిపడ్డారు. ఆదివాసుల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానానికి తప్పుడు నివేదికలు అందించడం జరిగిందన్నారు. న్యాయ స్థానాల కంటే ఏజెన్సీ ప్రాంతంలో పీసా గ్రామ సభ తీర్మానం ధృడమైనదన్నారు. వరుసల నిరోధాన్ని నిర్మూలించే దిశగా పయనించే బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఆదివాసి నవనిర్మాణ సేన నూతన ఒరవడికతో తీసుకువచ్చిన  ఉద్యమం తెలుగు రాష్ట్రాలలో విస్తరించాలన్నారు.
ఏఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నరసింహమూర్తి మాట్లాడుతూ ఆదివాసులంతా నిద్ర వ్యవస్థను వదలాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురంలో వలస గిరిజనేతర్ల పెత్తనం కొనసాగుతుందని, దానికి చరమగీతం పాడే రోజులు సమీపించాయన్నారు. శతాబ్దాల కాలం నుంచి కలిసి ఉంటున్న స్థానిక గిరిజనుల, గిరిజనేతరుల జీవన విధానాలలో మార్పులు రాలేదన్నారు.

allso read- ‘అమాత్యుల’ వ్యాఖ్యలు ఎవరికి గుణపాలు..?

కానీ వ్యాపార రీత్యా ఈ ప్రాంతానికి వలస వచ్చిన గిరిజనేతరులు ఆర్థికంగా కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. వలస వచ్చిన వారిని ఏజెన్సీ నుండి తరిమికొట్టేందుకు స్థానిక గిరిజనేతరల సహాయం కావాలని అర్జించారు. నీళ్లు, నిధులు, నియమకాలు అంటూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆదివాసులకు ఒరిగింది ఏమీ లేదన్నారు. వలస ఆంధ్రులను తెలంగాణ వదిలి వెళ్ళిపోవాలన్న కెసిఆర్ ఏజెన్సీ ప్రాంతంలోకి వలస వచ్చిన వారిని వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. వెంకటాపురం ప్రధాన రహదారికి ఇరువైపులా వలస వచ్చిన వారే స్థిరపడ్డారని ఆరోపించారు. పోడు పట్టాల విషయంలో సాధారణ గ్రామసభ నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనేరు రంగారావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. ఆ నివేదికలో ఉన్న సిఫారసులని ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో లక్షల ఎకరాల భూములు గిరిజనేతరల అస్తగతం అయ్యాయని తెలిపారు. వాటిని లాక్కోవాలని డిమాండ్ చేశారు. 1/70, పీసా చట్టం కు లోబడి మాత్రమే ప్రభుత్వ పాలన జరగాలన్నారు. ప్రశ్నించకపోవడం బానిసత్వానికి కారణం అన్నారు. అందరూ ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు.

allso read- జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం

గిరిజన ఇసుక సొసైటీల ద్వారా ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు దండుకుందన్నారు. కేవలం సొసైటీలకు 40 రూపాయలు ఇవ్వడం దారుణం అన్నారు. వారి సొసైటీ లోనే సభ్యులను కూలీలుగా మార్చిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇసుకలో యంత్రాలను ఉపయోగించే విధంగా ప్రభుత్వ విసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. ర్యాంపు నిర్వహణలో ఆంక్షలు లేకుండా , వచ్చిన లాభాలలో 50% గిరిజనులకు ఇవ్వాలని ప్రతిపాదించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్వకేట్ పూసాల శ్రీకాంత్ స్మిత్, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కల్తీ వీరమల్లు, చీమల నరసింహారావు,అరెం పాపారావు, వాసం ఆనంద్ కుమార్, సీనియర్ నాయకుడు మంకిడి  బుచ్చయ్య, చింత సమ్మయ్య, ఆదివాసి జర్నలిస్ట్ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధబోయిన సర్వేశ్, ఏఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు భార్గవ్, మండల అధ్యక్షుడు రాజేష్, తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి చిరంజీవి, వెంకటాపురం, వాజేడు మండలాల ఆదివాసీలు పాల్గొన్నారు.