Telugu News

దేవుడి కాళ్ళవద్ద మనిషి తల

నల్గొండ జిల్లాలో హత్య

0

దేవుడి కాళ్ళవద్ద మనిషి తల

నల్గొండ జిల్లాలో హత్య

తల..మెండం వేరు చేసిన హంతకులు

భయాందోళనకు గురవుతున్న జనం

(నల్గొండ -విజయంన్యూస్);-
ఓ మనిషిని హత్య చేశారు.. తలను దేవత విగ్రహం కాళ్ళవద్ద పెట్టారు.. మొండం మాత్రం కనిపించకుండా చేశారు.. ఎవరు చేశారో ఈ పని తెలియదు కానీ.. నల్గొండ జిల్లాలో కలకలం రేపింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లో దారుణం జరిగింది. హైదరాబాద్-నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి పై ఉన్న మెట్టు మహంకాళి దేవాలయంలో దేవత కాళ్ళ విగ్రహం వద్ద వ్యక్తి మొండెం వేరు చేసిన తలను అక్కడ పెట్టారు.

also read :-రైతుల ధాన్యాగారంగా తెలంగాణ……

వ్యక్తిని చంపి తలను వదిలి పెట్టి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు,మొండం మాత్రం కనిపించలేదు. అయితే క్షుద్రపోజలు జరుగుతున్న క్రమంలో ఈ హత్య జరిగిందా..? లేదంటే ఎక్కడైనా చంపి ఇక్కడ తలను మాత్రమే పెట్టి వదిలేసి వెళ్నిపోయారా అని విషయం తెలియడం లేదు.. కాగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..