Telugu News

60అడుగులకు చేరిన గోదావరి

గంటగంటకూ మారుతున్న ప్రవాహం

0

60అడుగులకు చేరిన గోదావరి

★★ మరింత పెరిగే అవకాశం

★★ కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక జారీ.

★★ గంటగంటకూ మారుతున్న ప్రవాహం

భద్రాద్రికొత్తగూడెం ప్రతినిధి, భద్రాచలం, జులై14(విజయంన్యూస్)

గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ప్రవాహ వేగం మారుతున్నది. భద్రాచలం వద్ద బుధవారం 60 అడుగుల మేర ప్రవహిస్తున్నది. 1976 తరువాత భద్రాచలం వద్ద 60 అడుగులు దాటి ప్రవహించడం ఇది ఆరోసారి అని అధికారులు చెప్తున్నారు. దీంతో కలెక్టర్‌ అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.  మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. అధికారులు ఎప్పటికప్పుడు ప్రమాద రహిత చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రజలను ఎవర్ని బయటకు రాన్నిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలు ఎవరు బయటకు రావోద్దని అధికారులు కోరుతున్నారు.  ఇక ఏజెన్సీ గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఇంకా వరద పెరిగే అవకాశం ఉండటంతో వందల గ్రామాలు నీళ్ళలోనే ఉండే అవకాశం ఉంది.

Allso read: –ఎంత వరద వచ్చిన ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్నాం: మంత్రి పువ్వాడ

◆◆ భద్రాచలం లోనే బస చేసిన మంత్రి

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ భద్రాచలంలోనే బస చేసి ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజల వద్దకు వెళ్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కోరుతున్నారు. ఎలాంటి విఫత్కర పరిస్థినైనా ఎదుర్కోడానికైన సిద్దమని ప్రకటించారు.

◆◆ కాళ్ళెశ్వరంలో పుష్కరఘాట్ ప్రమాద స్థాయిలో

కాళేశ్వరం పుష్కరఘాట్‌ వద్ద రెండో హెచ్చరిక
గోదావరి నది కాళేశ్వరం పుషరఘాట్‌ వద్ద 15 మీటర్లు ఎత్తును దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఒడ్డుపై ఉన్న ఇండ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. రామన్నగూడెం వద్ద గోదావరి నది 16.4 మీటర్లు, పేరూరు వద్ద 16.1 మీటర్లకు చేరుకొన్నది. పేరూరు వద్ద 3వ ప్రమాద హెచ్చరిక, రామన్నగూడెం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్‌, కడెం, మేడిగడ్డ వద్ద కూడా వరద ప్రవాహం కొనసాగుతున్నది. మూడు రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లో 11వేల చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. మొత్తంగా 18 పెద్ద చెరువులు తెగిపోగా, 161 చోట్ల కాలువలు, కుంటలు, తూములు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు.

allso read:- ప్రమాదంలో భద్రాద్రి..?

నేడు ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక?
ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం వద్ద గోదావరి పోటెత్తింది. బుధవారం ఇన్‌ ఫ్లో, ఔట్‌ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గురువారం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి ప్రస్తుతం 15.91 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో వస్తున్న వరద ప్రవాహాన్ని మళ్లించేందుకు స్పిల్‌వేలోని 48 క్రస్ట్‌ గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో పాటు రివర్‌ స్లూయిస్‌ గేట్ల ద్వారా కూడా వరద ప్రవాహం దిగువకు వెళ్తుంతుంది

Allso read:- మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ పోన్