Telugu News

పెరుగుతున్న గోదావరి వరద

రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు

0

పెరుగుతున్న గోదావరి వరద

== రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు

== వరద మరింత పెరిగే అవకాశం

== అప్రమత్తమైన అధికారులు

== జాగ్రత్త  చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు

== ఐటీడీఏలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్

భద్రాద్రికొత్తగూడెం, ఆగస్టు 10(విజయంన్యూస్)

గోదావరి మళ్ళీ పెరుగుతున్నది.. గత కొద్ది రోజుల క్రితం మహోగ్రరూపం చూపించిన గోదావరి సుమారు 71.60 అడుగుల వరకు వరద ప్రవహించి భద్రాద్రిని, గోదావరి పరివాహక ప్రాంతాలను ముంచేసింది. దీంతో వేలాధి మంది రోడ్డున పడగా, వందలాధి ఇండ్లు నీటమునిగిన సంగతి పాఠకులకు తెలిసింది. అయితే ప్రస్తుతం మరోసారి గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు వస్తుండటంతో శ్రీరామ్ సాగర్, కాళ్లేశ్వరం ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి వరద గంటగంటకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే బుధవారం నాటికి 50 అడుగులు దాటిన గోదావరి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 60 అడుగుల వరకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తుండగా, అందుకు గాను భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధికారులు అప్రమత్తమైయ్యారు. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైయ్యారు. పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ముంపుప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే హెచ్ఛరికలు చేసిన అధికారులు ఇంకా వరద పెరిగితే కచ్చితంగా పునరావస కేంద్రాలకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు.

allso read- తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక..?

== అత్యవసర సమావేశమైన అధికారులు, కలెక్టర్

భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనుదీఫ్ జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గోదావరి పెరిగే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు అధికారులు సహాయక  చర్యలకు సిద్దంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ర అందరు సిద్దంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. వరద పెరుగుతున్న కొద్ది అధికారులు, ముఖ్యంగా గోదావరి పారిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, డెంజర్ జోన్ లో ఉన్న ప్రజలందర్ని సురీక్షత ప్రాంతాలకు తరలించాని సూచించారు.