Telugu News

ఎంత వరద వచ్చిన ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్నాం: మంత్రి పువ్వాడ

విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0

సర్వం సిద్దంగా ఉన్నాం

== ఎలాంటి విపత్కర  పరిస్థితినైనా ఎదుర్కుంటాం

== భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగుల దాటే అవకాశం ఉంది

== లోతట్టు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాం

== అక్కడ ఏ ఒక్కరికి ఇబ్బందికి కల్గకుండా చర్యలు తీసుకుంటున్నాం

== హెలికాప్టర్ ను కూడా సిద్దం చేశాం

== వరదలతో ప్రాజెక్టులన్ని పొంగిపోర్లుతున్నాయి

== గోదావరి వరద పెరిగే అవకాశం ఉంది

== విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== ఇంటింట తిరిగి ప్రజలతో మాట్లాడిన మంత్రి

== సురీక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరిన మంత్రి

భద్రాద్రికొత్తగూడెం ప్రతినిధి, భద్రాచలం, జులై 13(విజయంన్యూస్)

గోదావరి ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని, అందుకు గాను అంత సర్వం సిద్దంగా ఉన్నామని, ఎలాంటి చిన్న నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.భద్రాచలంలో గోదావరి బ్రిడ్జి పై నుండి వరద ఉద్రుతినీ పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . అనంతరం భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ లో గల వరద ముంపు బాధితుల పునరావాస కేంద్రాలను పరిశీలించి వారికి ధైర్యం కల్పించారు. మీకు మేము అండగా ఉంటామని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని సరైన సమయంలో మీకు అందుతాయని, అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు తెలిపారు. అలాగే ముంపు పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ఇంటింటికి తిరిగి వారితో మాట్లాడారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..

allso read- ప్రమాదంలో భద్రాద్రి..?

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్దంగా ఉందన్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గోదావరి పరివాహిక ప్రాజెక్టులన్ని జలమయమైయ్యాయని, పొంగిపోర్లుతున్నాయని అన్నారు. దీంతో అక్కడ గేట్లు ఎత్తి గోదావరికి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో క్రమేపి గోదావరి పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎంత ప్లడ్ వచ్చిన ఎదుర్కునేందుకు మేము సర్వం సిద్దంగా ఉన్నామని తెలిపారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా  ఉన్నారని, ప్రతి విషయాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.

వరద ఉదృతి తీవ్రస్థాయిలో ఉంటే తక్షణ సహాయ చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ను ఏర్పాటు చేసిందని, ఐటీడీఏ, ఐటీసీ లో హెలిప్యాడ్ సిద్దం చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మేరకు సహాయక చర్యల కోసం పోలీస్ యంత్రాంగంతో పాటు సీఆర్పీఎఫ్,ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదనపు బలగాలతో సిద్దంగా ఉంచామన్నారు.ఇతర ప్రాంతాల ప్రజలు బయటకు రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉండాలని, అనవసరంగా బయటకు రాకుండా రావోద్దని కోరారు. సాహసకృత్యాలు చేయడం, చేపల వేటకు వెళ్ళడం, అకారణంగా రోడ్లపైకి రావడం సరికాదని సూచించారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించారు. గోదావరికి ఎగువ నుండి వస్తున్న భారీ వరదలు,  వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు వంకలతో ప్రాజెక్టులన్ని జలమయమైనాయని, దీనితో దిగువ ప్రాంతానికి వస్తున్న వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నదని అన్నారు.  భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగులకు వచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ని అదేశించామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

allso read- జిల్లాలోనే మకాం వేసిన  మంత్రి పువ్వాడ 

== నేను ఇక్కడే ఉంటా :మంత్రి పువ్వాడ

వరదలు పూర్తి స్ధాయిలో అదుపులోకి వచ్చే వరకు భద్రాచలంలో మకాం వేసి  ఎప్పటికపుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ తెలిపారు. ముంపు మండలాల్లో ఆయా ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అధికారులు, సిబ్బంది, పోలీస్ ఇతర ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. గత అనుభవాల దృశ్య వరదలపై మాకు అంచనా ఉందని, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే వ్యూహంతో ఉన్నామని, అధికారులు అన్ని గ్రామాల్లో సిద్దంగా ఉన్నప్పటికీ ప్రజలు సంయమనం పాటించి ఎక్కడి వారు అక్కడే ఉండాలన్నారు. ప్రజల అవసరాల కోసం 24 గంటలు పని చేయువిధంగా కలెక్టరేట్, ఐటిడిఎ, సబ్ కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు అధికారులకు సహకరిస్తూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మంత్రి పువ్వాడ సూచించారు.  జిల్లా యంత్రాంగం, ప్రజలు, వరదలు వర్షాల వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు.  ప్రసవ రోజులు దగ్గరగా ఉన్న గర్భిణి మహిళలను ఆసుపత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్,ఐటీడీఏ గౌతమ్,  ఇరిగేషన్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ వెంకటేశ్వర రెడ్డి, మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ అధికారులు ఉన్నారు.