Telugu News

అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నం: జిల్లా కాంగ్రెస్ 

జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, జావేద్

0

అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నం: జిల్లా కాంగ్రెస్ 
== 👉🏻కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు*
== 👉🏻జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, జావేద్

(ఖమ్మం -విజయం న్యూస్)
ఖమ్మం కాంగ్రెస్ పార్లిమెట్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని, సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, మహమ్మద్ జావేద్ లు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు. లోకసభ ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్య వేడుకను విజయవంతం చేసిన అధికారులు, పోలీసు సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను ప్రభంజన శక్తిగా నిలిపేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, రెవెన్యూ శాఖామాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వ్యవసాయ శాఖామాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారికి, సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మట్టా రాగమయి గారికి, వైరా శాసనసభ్యులు శ్రీ రామదాసు నాయక్ గారికి, అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ జారే ఆదినారాయణ గారికి, కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారికి, కాంగ్రెస్ గెలుపులో భాగం పంచుకునేందుకు కదం తొక్కుతూ గళం కలిపిన సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎం ఎల్) మాస్ లైన్ పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలకు, కాంగ్రెస్ తో కలిసి నడిచిన తెలుగు దేశం పార్టీ నాయకులకు, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో శ్రమించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలను ప్రజా క్షేత్రంలోకి తీసుకెళుతూ కాంగ్రెస్ కు మరింత ప్రాచుర్యం కల్పించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.వేసవి ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు కోసం పోటెత్తిన ఓటరు మహాశయులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఖమ్మం పార్లమెంట్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నామని అందుకు సహకరించిన ఖమ్మం పార్లమెంట్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా స్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ చేపట్టిన జోడొ భారత్, భారత్ న్యాయ్ యాత్ర తో ప్రజలు మార్పు కోరుకున్నారని భారీ మెజారిటీతో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని పీఠంపై కూర్చోబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ఐదు న్యాయాలను తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.అంతే కాకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని ఖచ్చితంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి రుణ మాఫీ చేస్తామని అంతే కాకుండా ఎన్నికల కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని తెలిపారు.