Telugu News

అమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన గాయత్రి రవి

బోనమెత్తిన గోల్కొండ

0

అమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన గాయత్రి రవి

== బోనమెత్తిన గోల్కొండ

ఖమ్మం, జూన్ 30:

గోల్కొండ కోట బోనమెత్తింది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్‌హౌజ్‌ చౌరస్తా వద్ద మంత్రులతో పాటు రవిచంద్రకు ఘన స్వాగతం పలికారు. డప్పు దరువులు, పోతురాజు విన్యాసాలతో అతిథులను తోడ్కొని వెళ్లారు. అక్కడ బంగారు బోనానికి మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌మూద్ అలీలతో కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. తొట్టెల‌కు స్వాగతం పలికి, శ్రీ జగదాంబిక అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించేలా దీవించమని రవిచంద్ర అమ్మవారిని వేడుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా జీవించేలా ఆశీస్సులు ఇవ్వాలని వేడుకున్నారు.

allso read- ఖమ్మంలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం

ఈ కార్య‌క్ర‌మంలో మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభా రెడ్డి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఆలయ కమిటీ చైర్మన్ వావిలాల మహేశ్వర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.