Telugu News

గోళ్లపాడు చానల్ కాలువలో పడి కార్మికుడు బలి

** కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఫలితంగానే ప్రమాదం జరిగిందంటున్న బందువులు

0

గోళ్లపాడు చానల్ కాలువలో పడి కార్మికుడు బలి
** కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఫలితంగానే ప్రమాదం జరిగిందంటున్న బందువులు
** కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకి దిగిన కాంగ్రెస్,సీపీఎం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్):-

ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ కి సమీపాన కుమ్మరి బజార్ లో విషాదం నేలకొంది. గోళ్లపాడు పార్క్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఆ కాలువలో పడి తురక సైదులు(36) మృతు చెందాడు. వివిధ రకాల కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సైదులు ఆదివారం సైకిల్ పై పనులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయాడు. అతన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు మృతుదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక బాబు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రీటౌన్ సీఐ సర్వయ్య కేసు దర్యాప్తు చేశారు.
** ఆందోళన చేసిన బందువులు, రాజకీయ పార్టీలు
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం వలన తురక సైదులు (36) అనే అసంఘటిత కార్మికుడు కాలువలో పడి మృతి చెందాడని అతని కుటుంబానికి నష్ట పరిహారం ప్రకటించి , నిర్లక్ష్టం వహించిన కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్,సి.పి.ఎం పార్టీ ఆందోళన దిగాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నప్పుడు ఆ పనులు పూర్తి అయ్యేవరకు ఆ ప్రాంతవాసులకు, వాహనదారులకు, ప్రయాణీకులకు ప్రమాదాలు జరగకుండా నిర్మాణ ప్రాంతంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కనీసం జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు.

అంతే కాకుండా రాత్రివేళ కనబడేవిధంగా రేడియం స్టిక్కెర్లు ఉపయోగించి ప్రమాదం నివారణ చర్యలు కాంట్రాక్టర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, వీటన్నిటిని సంబంధిత అధికారులు పర్యవేక్షించి కాంట్రాక్టర్ కి తగు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ పర్యవేక్షణా లోపం వల్ల తురక సైదులు మృతి చెందాడని , ప్రభుత్వం వెంటనే మృతుని కుటుంబానికి ఎక్సగ్రేషియా ప్రకటించాలని భాద్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసుల హామితో ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్,సిపిఎం నాయకులు యర్రా శ్రీనివాస్ రావు, భూక్యా శ్రీనివాసరావు, తుషాకుల లింగయ్య, అంకటి వెంకన్న, కొప్పెర ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

also read :-చారిత్రాత్మక రైతు పోరాట విజయం- 11న ముగింపు.