Telugu News

బీఆర్ఎస్ పార్టీకి జలగం గుడ్ బై.

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే

0

బీఆర్ఎస్ పార్టీకి జలగం గుడ్ బై.

== ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే

(కొత్తగూడెం -విజయం న్యూస్)

కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. ఆయన గెలుపు అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం మార్కెట్ లో తుమ్మల ప్రచారం

అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో అసంతృప్తిగా ఉన్న జలగం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి అంటిముట్టనట్లుగా ఉన్నారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కు కేటాయించగా జలగం వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. కాగా జలగం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరేందుకు మక్కువ చూపినప్పటికి కాంగ్రెస్, సీపీఐ పొత్తు కుదిరితే సీపీఐకి కేటాయించే అవకాశం ఉండటంతో జలగం వెంకట్రావు కొంత బ్యాక్ అయ్యారు. అయితే కాంగ్రెస్, సీపీఐ పొత్తు రద్దు కావడంతో జలగం వెంకట్రావ్ ను కాంగ్రెస్ పార్టీ సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:- కరకగూడెం లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్..

కాగా జలగం అంగీకరించండంతో ఆయన విషయమై పార్టీ అధిష్టానంతో చర్చించగా వారు అంగీకరించి కొత్తగూడెం టిక్కెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ వెళ్ళగా అయితే రాహుల్ గాంధీ ఆదేశాలతో మంగళవారం ఢిల్లీలో లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. 

ఇది కూడా చదవండి ఇందిరమ్మ రాజ్యం కోసం…! ఒక్కొక్కరూ ఒక్కో శీనన్న కావాలి…!!