Telugu News

బీఆర్ఎస్ పార్టీ కి తుమ్మల గుడ్ బై

పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి

0

*బీఆర్ఎస్ పార్టీ కి తుమ్మల గుడ్ బై

== పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి

== నేడు సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
(ఖమ్మం ప్రతినిధి – విజయం న్యూస్)
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పాలేరు నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ టికెట్ను ఆశించిన తుమ్మల నాగేశ్వర రావు కు అపార్టీ అధినేత సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో అసంతృప్తిగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇది కూడా చదవండి:- నేడు తుమ్మల జాయినింగ్

ఇటీవల హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాకు వస్తున్న సందర్భంగా అనుచరులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున భారీగా జిల్లా సరిహద్దు నాయకుని గూడెం గ్రామం వద్ద భారీగా స్వాగతం పలికే సంగతి పాఠకులందరికీ తెలిసిందే. అభిమానులు కార్యకర్తలు తో కలిసి ఆయన బల నిరూపణ చేశారు. ఖమ్మం అంటే తుమ్మల తుమ్మల అంటే ఖమ్మం అనే విధంగా ఉన్న ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవటాన్ని తీవ్రంగా పరిగణించిన తుమ్మల నాగేశ్వరావు తన ఆధిపత్యాన్ని చూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని కోరారు.

ఇది కూడా చదవండి:- ప్రసవానికి పోవాలంటే వాగు దాటాల్సిందేనా..?

ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పై ఆసక్తి కనపరచిన తమిళనాడు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల డాష్ రోడ్డు కలిసి పార్టీలో ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో చేరాలని అందుకు సమ ప్రాధాన్యత కల్పిస్తామని వారు కోరారు దీంతో సానుకూలంగా స్పందించిన అభిమానులు కార్యకర్తలు అభిప్రాయమే నా అభిప్రాయం అంటూ తేల్చేశారు అనంతరం కొద్దిరోజుల తర్వాత శుక్రవారం హైదరాబాద్ నివాసంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ రాష్ట్ర వివరాలు ఇన్చార్జి మాణిక్యరావు టాక్రే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో కలిసి మాట్లాడారు పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించడంతో వెంటనే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు టాక్రే సోనియా గాంధీతో మాట్లాడి పార్టీలో చేరిక సమయాన్ని ఖరార్ చేశారు.

ఇది కూడా చదవండి:- జర్నలిజం ముసుగులోని అసాంఘీక శక్తులపై తరిమెద్దాం : ఐజేయు

కాగా తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు పని చేసిన టిఆర్ఎస్ పార్టీకి తన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు పంపించారు. ఎన్ని రోజులపాటు సహకరించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు అందరికీ సేమ్ కెసిఆర్ కు ధన్యవాదాలు అంటూ లేఖలో ప్రచురిస్తూనే పార్టీకి రాజీనామా సమర్పిస్తున్నానని ఒక్క లైన్ మాత్రమే రాసి లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. తను ఎక్కడ కూడా పార్టీపై కానీ నాయకులపై కానీ విమర్శలు చేయకుండా హుందాగా రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ పంపటంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నారు. తను మరోసారి తన రాజకీయ చాణిక్యతను చాటుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు.
== నేడు సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి తుమ్మల
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు నేడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమక్షంలో తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12:35కు ఆయన కాంగ్రెస్ పార్టీ గూటిలోకి చేరనున్నారు.  ఈనెల 17 తారీఖున హైదరాబాద్ లోని తుక్కగుడాలో జరిగే భారీ బహిరంగ సభ విజయభేరి సభలో తుమ్మల వర్గీయులు అనుచరులు పెద్ద మొత్తంలో కార్యకర్తలు పార్టీలో చేరనున్నారు. అందుకుగాను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ ర్యాలీతో హైదరాబాదులోని తుక్కుగూడ విజయభేరి సభకు హాజరుకానున్నారు.