బీఆర్ఎస్ కు తుమ్మల గుడ్ బై..?
== త్వరలో ఖమ్మం జిల్లాకు తుమ్మల
== నాయకన్ గూడెం నుంచి భారీ ర్యాలీ, రోడ్ షో.. కూసుమంచిలో సభ
== తాడోపేడో తెల్చనున్న మాజీ మంత్రి
== పాలేరులో తుమ్మల అనుచరుల తిరుగుబావుట
== ఖమ్మం రూరల్ మండలంలో ఓ పంక్షన్ హాల్ లో సమావేశం
== కాంగ్రెస్ కు వెళ్లాల్సిందేనని తీర్మాణం చేసిన అనుచరులు
== తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంటేనన్న వర్గీయులు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారా..? టిక్కెట్ రాని పక్షంలో ఆయన జాతీయ పార్టీలోకి వెళ్లేందుకు మార్గం సులువు చేసుకుంటున్నారా..? అనుచురులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారా..? పాలేరు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు సర్వం సిద్దమవుతున్నారా..? నమ్మిన నాయకుడు మోసం చేయడంతో తాడోపేడో తేల్చేందుకు సిద్దమైయ్యారా..? అనుచరులకు మాజీ మంత్రి ఏం చెబుతున్నారు..? ప్రజలకు ఏం చెప్పబోతున్నారు..? ఎప్పుడు ఖమ్మం జిల్లాకు రాబోతున్నారు..? వచ్చిన తరువాత ఏం ప్రకటన చేయబోతున్నారు..? ఇదే టెన్షన్.. ఇదే సర్వత్ర చర్చ.. ఎక్కడ చూసిన ఇదే మాట.. తుమ్మల ఏం చేయబోతున్నారనే విషయంపై సర్వత్ర చర్చ జరుగుతోంది.. రెండు రోజుల్లో ఖమ్మం రాబోతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.. అయితే ఇంతలోనే ఆయన అనుచరులు, అభిమానులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతుండటం గమనర్హం. పాలేరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది..?
(కూసుమంచి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల లోల్లి గల్లికి పాకింది..టిక్కెట్ దక్కని నేతలు పార్టీని వీడేందుకు సిద్దమైయ్యారు. తాడో పేడో తెల్చుకునే పనిలో పడ్డారు.. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గానికి టిక్కెట్ అశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన రగలిపోతున్నట్లుగా తెలుస్తోంది. నమ్మిన నాయకుడు వెన్నుపోటు పొడిచారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన్నే నమ్ముకుని నియోజకవర్గంలో ఎన్నో అవమానాలు ఎదురైన, ఆయన అనుచరులకు టిక్కెట్ ఇవ్వకపోయిన భరించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు అసలకే ఎసరు రావడంతో తాడోపేడే తెల్చుకునే పనిలో పడ్డారు. టిక్కెట్ కోసం కాకుండా పాలేరు లో ఎలా గెలవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.. టిక్కెట్ ఇవ్వని స్నేహితుడికి ఎలాంటి రిటన్ గిప్ట్ ఇవ్వాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: మట్టాదయానంద్ కు బిగ్ షాక్
ఈ మేరకు ఆయన కొంత మంది సీనియర్ నాయకులను, ఆయనతో కలిసి పనిచేసిన సీనియర్ నాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా స్నేహితులు సలహా మేరకు బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన అతి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ కు అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
== కాంగ్రెస్ గూటికి తుమ్మల..?
తుమ్మల నాగేశ్వరరావు కు బీఆర్ యస్ అధినేత సీఎం కేసీఆర్ పాలేరు టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది..బీఆర్ యస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన వెంటనే తుమ్మల అనుయాయిలు , స్నేహితులు హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. ఆయన భవిష్యత్ వ్యూహంపై తర్జన భర్జనలు జరిగాయి. అందులో పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలపై చర్చ జరిగినట్లు సమాచారం… అయితే కాంగ్రెస్ లో చేరాలని కొంతమంది సూచించారని మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థిగా పాలేరు లో పోటీచేయాలని కోరినట్లు తెలుస్తుంది. ఆయన పోటీ చేయాలనీ మాత్రం అందరు ఏకాభిప్రాయానికి వచ్చారు. పార్టీ ఏదైనా పోటీ ఖాయం అనే అభిప్రాయానికి తుమ్మల సైతం వచ్చారు . కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానం ఉంటె ఆలోచించాలని లేకపోతె పాలేరు లో తన తడాకా చూపించాలనే ఆలోచనలో ఉన్నారు …బీజేపీ కూడా ఆయనకు గాలం వేస్తున్నాయి. అయితే జిల్లాలో బీజేపీకి ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఆయన సహచరులు సైతం బీజేపీ వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు .
== రెండు రోజుల్లో ఖమ్మం తుమ్మల ఇది కూడా చదవండి: రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పువ్వాళ్ళ
చిన్న ఆరోగ్య సమస్యతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు, మూడు రోజుల్లో ఖమ్మం జిల్లాకు రానున్నారు. టిక్కెట్ రాకుండా తొలిసారిగా ఖమ్మం వస్తున్న సందర్భంలో తుమ్మల వర్గీయులు తమ సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాయకన్ గూడెం నుంచి తుమ్మలకు భారీగా స్వాగతం పలకాలని, సుమారు 2000 మోటర్ సైకిళ్లు, 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించాలని మాజీ మంత్రి తుమ్మల వర్గీయులు, అనుచరులు ఆలోచిస్తున్నారు. నాయకన్ గూడెంలో స్వాగతం ఏర్పాట్లు చేసి, అక్కడ నుంచి కూసుమంచి మీదగా వరంగల్ క్రాస్ రోడ్డ్, ఖమ్మం వరకు ర్యాలీని నిర్వహించాలని అనుకుంటున్నారు. కూసుమంచిలో సభను ఏర్పాటు చేసి అక్కడే సీఎం కేసీఆర్ కు అల్టి మేటం జారీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే పార్టీ మారే విషయం, పోటీ చేసే విషయంపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
== సీనియర్ నాయకుడికి అవమానమేనా..?
సీనియర్ మంత్రిగా ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో కీలకంగా వ్యహరించి అభివృద్ధి ప్రదాతగా నిలిచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడం పట్ల ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. పెద్దాయనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికైనా కేసీఆర్ మాటలు నమ్మకుండా తను స్వంత నిర్ణయం తీసుకోవాలని, భవిష్యత్ కు ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలని జిల్లాలోని తుమ్మల అనుచరులు, అభిమానులు కోరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకోపోతే రాజకీయ భవిష్యత్ మసకబారిపోతుందని, అందుకే కచ్చితంగా పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
== అత్యవసర సమావేశమైన తుమ్మల అనుచరులు
బీఆర్ యస్ అభ్యర్థుల ప్రకటన ఆపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది…టికెట్ దక్కని అనేకమంది నేతలు పార్టీ వీడేందుకు సిద్దపడుతున్నారు. బీఆర్ యస్ నేత సీఎం కేసీఆర్ వైఖరిపై భగ్గుమమంటున్నారు .ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని మాజీ మంత్రి తుమ్మల అనుచరులు మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని ఒక ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో సమావేశం అయ్యారు . నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు 250 మంది తుమ్మల అభిమానులు ఈసమావేశానికి హాజరైయ్యారు. తుమ్మలకు టికెట్ ఇవ్వకపోవడాన్ని సమావేశంలో ప్రసంగించిన నేతలు తీవ్రంగా ఖండించారు. గత ఎన్నికల్లో తుమ్మల ఓటమి ఎలా జరిగిందనేది తెలిసిన సీఎం కేసీఆర్ తుమ్మలకు టికెట్ నిరాకరించడాన్ని తప్పు పట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే కందాల కు తిరిగి టికెట్ ఇవ్వడంపై వారు భగ్గుమన్నారు. కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే పాలేరు నియోజకవర్గానికి తుమ్మల చేసిన అభివృద్ధిని, సేవలను కొనియాడారు. కందాల ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులు ఏమిలేవని వారు పేర్కొన్నారు. పాలేరులో తుమ్మలకు టికెట్ నిరాకరించడం పెద్ద తప్పిదనమని,అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. టీడీపీలో ఉన్న తుమ్మల సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు నాడు టీఆర్ యస్ లో చేరిన విషయాన్నీ గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి టికెట్ నిరాకరించి అవమానపరచడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు . అనేక సందర్భాల్లో పార్టీ అవమానించినప్పటికీ కేసీఆర్ కు ఇచ్చిన మాట కోసం తుమ్మల నిలబడ్డారని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ తుమ్మలను పక్కన బెట్టడంపై బీఆర్ యస్ కార్యకర్తలు, తుమ్మల అనుయాయిలు మండిపడుతున్నారు.
== కాంగ్రెస్ లోకి వెళ్లాలని తీర్మాణం
పాలేరు నియోజకవర్గంలోని ఓ పంక్షన్ హాలో సమావేశమైన కార్యకర్తలు, నాయకులు తుమ్మల నాగేశ్వరరావు భవిష్యత్ కార్యచరణపై పలువురు మాట్లాడారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీఆర్ఎస్ ను దెబ్బతీయగలదని, ఆ పార్టీ నుంచి తుమ్మల పోటీ చేసే భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని, అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి సీఎం కేసీఆర్ కు రిటర్న్ గిప్ట్ పంపించాలని తుమ్మల అభిమానులు నిర్ణయించారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మాణం చేశారు.
తుమ్మల ఏ నిర్ణయం తుసుకున్న ఆయన వెంట నడుస్తామని వారు ముక్త కంఠం తో నినదించారు . సమావేశంలో ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం,కూసుమంచి, నేలకొండపల్లి మండలాల నుంచి అభిమానులు హాజరైయ్యారు. మద్ది మల్లారెడ్డి, శాఖమూరి రమేష్, బండి జగదీష్, జొన్నల గడ్డ రవి, వెన్నపూసల సీతారాములు, మాదాసు ఉపేందర్, ఇంటూరి పుల్లయ్య, బారీ వీరభద్రం, రాందాసు తదితరులు పాల్గొన్నారు.