నేలకొండపల్లి సర్పంచ్ కాంగ్రెస్ కు గుడ్ బై
== ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నవీన్
(నేలకొండపల్లి-విజయంన్యూస్)
పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందనే చెప్పోచ్చు.. నేలకొండపల్లి మండలంలో మేజర్ గ్రామపంచాయతీ అయిన నేలకొండపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయపూడి నవీన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. శనివారం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కండువ కప్పి స్వాగతం పలికారు. సర్పంచ్ రాయపూడి నవీన్ తో పాటు మంగాపురం తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ధారావత్ నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
allso read- మున్నేరు వరదబాధితులకు అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కర్ని కచ్చితంగా ఆదుకుంటానని, అండగా ఉంటానని భరోసానిచ్చారు. కొత్త,పాత అందర్ని కలుపుకుని వెళ్తానని అన్నారు. నా మంచితనం, ప్రభుత్వ పథకాలు అమల తీరు, సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమాభివ్ది పథకాలకు అకర్షితులై పాలేరు నియోజకవర్గంలోని వందలాధి మంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాయపూడి నవీన్ మాట్లాడుతూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి చేపట్టిన పథకాలు , ఆయన వ్యక్తిగతం నాకు చాలా బాగా నచ్చాయని, అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కోట్లాట తప్ప పార్టీ నాయకులు, కార్యకర్తల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య తదితరులు హాజరైయ్యారు.
ఇది కూడా చదవండి: కందాళ సేవకు సలామ్