Telugu News

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై

== సర్పంచ్ తో సహా పలువురు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరిక

0

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై
== సర్పంచ్ తో సహా పలువురు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరిక
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ముదిగొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు గుడ్ బై చెప్పారు. సర్పంచ్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, వార్డు సభ్యులు, పలు కుటుంబాలు జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా వారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కండువ కప్పిస్వాగతం పలికారు. మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం, ఖానాపురం గ్రామం కాంగ్రెస్ పార్టీ నుండి గ్రామ సర్పంచ్ మాలోజి ఉషా, భర్త మాలోజి గోవిందు, మాజీ సర్పంచ్ ఉయ్యాల సాంబయ్య, మాజీ ఎంపీటీసీ కామాల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు తలారి మదారమ్మ, జాలాది తిరుపమ్మ, కొత్తపల్లి రాణి , యలమద్ధి రవి సహా 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ టీఆర్ఎస్: సర్కారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు తాము ఆకార్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

also read :-ఖాళీ జాగా…వేసేయ్ పాగా…!

ముఖ్యంగా గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం అందులో భాగంగా వైకుంఠదామాలు, డంపింగ్ యార్డు, పెన్షన్లు సకాలంలో అందించడం, రైతు బంధు, రైతు బీమా, లాంటి మరెన్నో సంక్షేమ కార్యక్రమాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రైతుల కష్టాలు తొలిగి వారి కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.