Telugu News

అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు శుభవార్త.

ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు.

0

అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు శుభవార్త.

== మినీ అంగన్ వాడీలను ప్రధాన అంగన్ వాడీలో అప్ గ్రేడ్ చేస్తూ జీవో జారీ

== 65ఏళ్ల వయస్సును నిర్దేశిస్తూ జీవో జారీ

== సంతోషం వ్యక్తం చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు

== రాష్ట్రలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు అవకాశం

== ఉద్యోగ విరమణకు అంగన్ వాడీ టీచర్లకు రూ.1లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50వేలు అందిస్తూ ప్రభుత్వ నిర్ణయం

== ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ టీచర్లకు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. మినీ అంగన్ వాడీ కేంద్రాలను, ప్రధాన అంగన్ వాడీ కేంద్రలకు అఫ్ గ్రేడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తద్వారా రాష్ట్రంలో మొత్తం 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలు అఫ్ గ్రేడ్ లోకి వచ్చాయి. అలాగే ప్ఱధాన అంగన్ వాడీ కేంద్రాల టీచర్లతో పాటు, మినీ అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉద్యోగ విరమణ సయమంలో ఉత్త చేతులతో పంపించకుండా ప్రభుత్వం వారికి బెనిఫిట్ ఆపర్ ను ప్రకటించింది.

ఇది కూడా చదవండి:- మీరు గర్వపడేలా  అభివృద్ది చేస్తా: మంత్రి పువ్వాడ

ప్రధాన అంగన్ వాడీ కేంద్రాల టీచర్లకు రూ.1లక్ష, మినీ అంగన్ వాడీ కేంద్రాల టీచర్లకు, హెల్పర్లకు రూ.50వేలను అందజేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ, ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ.ఒక లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50వేలు అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో జారీ చేసింది. అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్ లకు 50 ఏండ్ల వరకు 2లక్షల రూపాయలు ఇన్సూరెన్స్  సౌకర్యం, 50 ఏండ్లుదాటిన వారికి 2 లక్షల రూపాయల ఏక్స్ గ్రేషియా కల్పించారు. దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20,000 లు, హెల్పర్లుకు రూ.10 వేలు సాయం అందిస్తూ ప్రభుత్వం జీవో లు జరిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మినిఅంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో నలు దిక్కుల అభివృద్ది చేసి:మంత్రి పువ్వాడ

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు పెద్ద పేట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20,000 లు, హెల్పర్లుకు రూ.10 వేలు సాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. దేశంలోనే అంగన్‌వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. కోవిడ్ సమయంలో  అంగన్వాడీల సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు అందజేసేయని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ మాత్రమే అని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.  ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి:- వేషగాళ్లు వస్తున్నారు..? జరజాగ్రత్త: మంత్రి

మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్‌వాడీలను అంతే గౌరవంగా చూస్తూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తున్నారన్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారతసమగ్ర సేవల రక్షణపోషణఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య లక్ష్మీ పథకం అమలు చేస్తూ.. మహిళ గర్భం దాల్చినప్పట నుంచి ప్రసవించిన తర్వాత కూడా వారి సంక్షేమం కోసం తల్లితండ్రి వలె ఈ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అంగన్వాడీల టీచర్లు హెల్పర్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.