Telugu News

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త.

మరోసారి మెట్రో రైలు సర్వీసు సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ.

0

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త.

మరోసారి మెట్రో రైలు సర్వీసు సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ.

ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

( హైదరాబాద్ ప్రతినిధి – విజయం న్యూస్) :-

 

ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌) వేళల్లో మార్పులు చేసింది. కొత్త టైంటేబుల్ నవంబర్‌ 10 నుంచే అమలులోకి రానున్నాయి. ఉదయం 6 గంటలకు తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది. అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్‌ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. మెట్రో సేవలు పొడిగించాలని మంత్రి కేటీఆర్‌ను ఓ ప్రయాణికుడు కోరడంతో దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి.. మెట్రో రైల్ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మెట్రో రైల్ సేవల వేళ్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇదిలావుంటే, అభినవ్‌ సుదర్శి అనే ప్రయాణికుడు ఉదయం వేళ మెట్రోరైలు ఫ్లాట్‌ఫామ్‌ల వద్ద రైళ్ల కోసం ఎదురు చూస్తున్న జనం రద్దీ, వృద్ధులు, మహిళలు పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా సోమవారం ట్యాగ్‌ చేశారు. తెల్లవారుజామునే నగరానికి వచ్చే వారికి రవాణా సౌకర్యాలు సరిగాలేక ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 6 నుంచే మెట్రోరైళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అభినవ్‌ మాటలతో ఏకీభవిస్తున్నట్టు రీట్వీట్‌ చేశారు. మెట్రో ఎండీ స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనికి మెట్రో ఎండీ సైతం సానుకూలంగా స్పందించారు

 

also read :- ఆటో బోల్తా పడి ఒకరి మృతి

also read :- గంజాయి సేవించేందుకు వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

 

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*