తెలంగాణ రైతులకు శుభవార్త
== రుణమాఫీ అమలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
== ఆగస్టు 3 నుంచి పున: ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన సీఎం
== రాష్ట్రంలో రూ.19వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ నిర్ణయం
== హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
== చిత్తశుద్దితో చేయాలంటున్న రైతు సంఘాల నాయకులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే అమలవుతుంటే.. ఇన్నినాళ్ల దాగిన హుదయం ఎగిసిఎగిసి పడదేమి.. ఇంకా తెలవారదేమి..ఈ చికటి వీడిపోదేమి అంటూ ఓ సినికవి రాసిన పాటల ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి.. తొమ్మిదిన్నరేళ్లుగా ఎన్నో కళ్లతో రుణమాఫీ కోసం ఎధురుచూస్తున్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఆగస్టు 3 నుంచి రుణమాఫీ ప్రక్రీయను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ చెప్పడంతో రైతుల్లో సంతోషం నెలకొంది.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.19వేల కోట్ల బ్యాంక్ రుణాలను ప్రభుత్వం రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే రుణమాఫీ ఎన్నికల ప్రక్రీయలో భాగంగా ప్రకటించిందని, సీఎం కేసీఆర్ కు, ప్రభుత్వం చిత్తశుద్దితో రుణమాఫీ చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నువ్వా..నేనా..? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?
మరో వైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2009 ఎన్నికల తరువాత ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ పథకంపై తొలి సంతకం చేశారు. రూ.రెండు లక్షల రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని, తొలిసంతకం రుణమాఫీ పథకంపై పెడతానని సీఎం వైఎస్ఆర్, అనుకున్నట్లుగానే తొలిసంతకం రుణమాఫీ పథకం పై సంతకం చేసి ఏకకాలంలో రుణమాఫీ వర్తింపజేశారు. దీంతో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం జరిగింది. ఆ సమయంలో ఎన్నికల కంటే ముందు అన్ని పార్టీలు రుణమాఫీ పథకాన్ని వర్థింపజేస్తామని ఆయా పార్టీల మేనిఫెస్టోలో పొందపరచడం జరిగింది. అయితే కూడా ఈ పథకం కొనసాగింది. అనంతరం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగా, ఆ ఐదేళ్ల పాటు రుణమాఫీ జరగలేదు.. ఆ తరువాత2018లో జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయం సాధించింది. ఇక రుణమాఫీ జరుగుతుందని భావించారు. కానీ మూడున్నరేళ్ల తరువాత రూ.25వేల లోపు మాత్రమే రుణమాఫీ చేసింది. ఆ తరువాత రుణమాఫీ ఊసేలేదు. నాలుగున్నరేళ్ల తరువాత కూడా రుణమాఫీ జరగలేదు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ రుణమాఫీ చేయాలని సంకల్పించారు. అందులో భాగంగానే రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఆగస్టు 3 గురువారం నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశించారు. తక్షణమే రుణమాఫీ ప్రక్రీయను ప్రారంభించాలని ఆదేశించడంతో యావత్తు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది..
== హర్షం వ్యక్తం చేస్తున్న మంత్రి, బీఆర్ఎస్ నాయకులు
రైతు రుణమాఫీ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు, మొచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియా, ఎమ్మెల్సీ తాతామధు సూదన్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, గాయత్రి రవి సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. రైతులకు మేలు చేసే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కష్టకాలంలో ఉన్నప్పటికి రూ.19వేల కోట్లను రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉండాలన్నారు. ఏ పార్టీ కూడా రైతులకు మేలు చేయలేదన్నారు. రైతుల కోసం రైతుబంధు లాంటి అద్భుత అదర్శనీయమైన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని కొనియాడారు.
== చిత్తశుద్దితో అమలు చేయాలి
రైతు రుణమాఫీ అమలు చేయాలనే సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ఆయా పార్టీలకు చెందిన రైతు సంఘాల నాయకులు స్వాగతం పలికారు. అయితే గతంలో రైతు రుణమాఫీ అని చెప్పిన సీఎం కేసీఆర్ ఏ ఒక్కరికి రుణమాఫీ చేయలేదని, చేసిన రుణమాఫీ కూడా వడ్డీలకే పరిమితమైయ్యాయని అన్నారు. రుణమాఫీ చేస్తామనడంలో సందేహాలు ఉన్నాయన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తారు.. వడ్డీలతో సహా రుణమాఫీ చేస్తారా..? లేదంటే తీసుకున్న రోక్కంను మాత్రమే రుణమాఫీ చేస్తారా..? అయితే వడ్డీల సంగతేంటని రైతు సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ ను ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
== రైతు రుణమాఫీ చేయడం హర్షనీయం : మంత్రి పువ్వాడ అజయ్
రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాఘటంగా కొనసాగిస్తూనే వస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని, తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు.’’ అని అన్నారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని, ఈకార్యక్రమాన్ని రేపు అనగా ఆగస్టు 3వ తేదీ నుంచి పున: ప్రారంభించాలని సిఎం ఇప్పటికే ఆదేశించారని వెల్లడించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలపదిహేనురోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సిఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని రైతులకు సూచించారు.