గురుకుల ఉపాధ్యాయులకు శుభవార్త
== గురుకుల పాఠశాల ఉపాద్యాయులు క్రమబద్దీకరణ..
== ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.*
== కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులు.*
== ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కానుక.*
== హర్షం వ్యక్తం చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్*
(ఖమ్మం -విజయం న్యూస్)
ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నిర్ణయం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:- మత్య్సకారుల అభివృద్ధే లక్ష్యం: మంత్రి
సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను ప్రభుత్వం ప్రకటించడం చరిత్రాత్మకం నిర్ణయమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:- నాలుగేళ్లలో నలుదిక్కుల అభివృద్ది: మంత్రి పువ్వాడ
పేదలకు ప్రభుత్వ విద్యను చేరువ చేయడంలో భాగంగా మన ఇప్పటికే అద్భుతంగా అమలు చేసిన మన ఊరు మన బడి , మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యకు విశేష ఆదరణతో పాటు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల విపరీతంగా పెరిగిందన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్దీకరణతో ఉద్యోగులకు భద్రత లభించిందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉపాద్యాయులందరికీ మారో సారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు..