Telugu News

గోపాలరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు….

గోపాలరావు ఆశయాలను కొనసాగిద్దాం

0

గోపాలరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు….
గోపాలరావు ఆశయాలను కొనసాగిద్దాం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
(చండ్రుగొండ -విజయం న్యూస్): –

దివంగత కాంగ్రెస్ పార్టీ నాయకుడు సొసైటీ మాజీ చైర్మన్ ఇంజం గోపాలరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు.. మండలంలోని గానుగపాడు గ్రామంలో శనివారం ఇంజ0 గోపాల్ రావు విగ్రహానికి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. తొలుత గోపాల్ రావు విగ్రహాన్ని జడ్పిటిసి సభ్యులు కొడకండ్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తో కలిసి ఆవిష్కరించారు..

also read :-కాంగ్రెస్ సభ్యత్వం ప్రజలందరికి భరోసానిస్తుంది

ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం లో తనదైన ముద్ర వేసి ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావించి అనునిత్యం ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజలకు సేవ చేశారు… ఈ కార్యక్రమంలో నాగా సీత రాములు, ములకలపల్లి జెడ్ పి టి సి సున్నం నాగమణి, మాజీ జెడ్పిటిసి బానోత్ కమలమ్మ, మాజీ ఎంపీపీగుగులోత్ బాబు, ఎండి షబీర్ హుస్సేన్, జూలూరుపాడు టిఆర్ఎస్ నాయకులు వెల్లంకి సత్యనారాయణ, లీళ్ళ వెంకట్ రెడ్డి, నల్లమోతు రమణ, ఇంజo అప్పారావు, చుండ్రు విజయ్, వనమా గాంధీ, కేశ బోయిన నరసింహారావు వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు