Telugu News

గోరేటి వెంకన్నకు అరుదైన గౌరవం

== ప్రజాకవికి కేంద్ర సాహిత్య పురష్కారం

0

గోరేటి వెంకన్నకు అరుదైన గౌరవం
== ప్రజాకవికి కేంద్ర సాహిత్య పురష్కారం
== అభినందనలు తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం
(హైదరాబాద్ –విజయంన్యూస్)
ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ వాగ్గేయకారుడు, జానపదగాయకుడు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నకు అత్యుతన్నత పురస్కారం వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ’వల్లంకి తాళం‘ కవితా గేయ రచనకు వెంకన్నకు అవార్డు ఇచ్చారు. 2021 సంవత్సరానికి గాను కవిత్వ విభాగంలో వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్డు లభించింది. ఈ అవార్డు కిందా ఆయనకు ప్రశంసాపత్రంతో పాటు రూ.1లక్ష నగదు ఇవ్వనున్నారు. కేంద్ర సాహిత్య అకడమి ప్రతి ఏటా 20భారతీయ భాషల్లో ప్రాచుర్యం పొందిన సాహిత్యానికి అవార్డులు ప్రకటించడం అనావాయితీగా వస్తోంది. 2016లో తెలంగాణ ప్రభుత్వం వెంకన్నకు కాలోజీ పురస్కారం అందించింది.

2006 లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును ప్రధానం చేసింది. అంతేకాకుండా తెలంగాణ పాటను విశ్వవాప్తం చేసిన గోరేటి వెంకన్నకు మధ్యప్రదేశ్ ప్రభఉత్వం 2019లో ’కబీర్ నమ్మాన్‘ పురస్కారం ప్రధానం చేసింది. జానపద పాటలతో ప్రజల్ని ఎంతో అకట్టుకునే వెంకన్న మా టీవిలో ప్రచారమైన రేలారేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజాతో కలిసి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జన్మించిన వెంకన్న, పల్లె ప్రజలు, ప్రకతిపై ఎన్నో పాటలు రాయడమే కాకుండా స్వయంగా ఆయనే పాడుతూ ఆడుతూ ఉర్రూతలూగించారు. కేంద్రసాహిత్య పురస్కారం రావడం పట్ల రాష్ర్టంలోని మంత్రులు, సాహిత్యవేతలు, కవులు, కళకారులు వెంకన్నకు అభినందనలు తెలిపారు. విజయం పత్రిక, వెబ్ సైట్ ద్వారా కూడా గోరేటి వెంకన్నకు అభినందనలు తెలియజేస్తున్నాము.. మరిన్ని అవార్డులు ఆయనకు దక్కాలని, మరిన్ని పురస్కారాలు, ఉన్నతమైన పురస్కారాలు రావాలని ’విజయం‘ కోరుకుంటుంది.

also read :-ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు