Telugu News

ప్రభుత్వం కీలక నిర్ణయం..!

పండుగ తర్వాత స్కూల్స్ కాలేజీలు క్లోజ్

0

ప్రభుత్వం కీలక నిర్ణయం..!

పండుగ తర్వాత స్కూల్స్ కాలేజీలు క్లోజ్

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. కరోనా పాజిటివ్ రేట్​పెరుగుతుండటంతో విద్యా సంస్థలు ఆన్‌లైన్​క్లాసుల వైపు మొగ్గు చూపుతూ నిర్ణయం తీసుకున్నాయి.పండుగ ముందే నిర్ణయాన్ని ప్రకటించాయి. విద్యార్థులకు ఫోన్​ ద్వారా సమాచారం పంపించారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యార్థులకు శుక్రవారం నుంచే సమాచారం అందించారు.ఆదివారం నుంచి జూమ్​లింకులు ఇస్తున్నట్లు వెల్లడించారు. నేడో, రేపో.. ఇంటర్, పాఠశాల విద్యార్థులకు కూడా ఆన్‌లైన్ క్లాసులపై నిర్ణయం వెల్లడించే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అటు రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో పాజిటివ్​ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటగా.. రాష్ట్రంలో రెండువేలు దాటాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో నామమాత్రపు ఆంక్షలున్నాయి. అటు ఏపీలో మాత్రం నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక కరోనా వ్యాప్తిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కేంద్రం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది.

also read :-విజయం పత్రికకు అండగా ఉంటా: మాజీ ఎంపీ పొంగులేటి

కాగా ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు కొనసాగుతున్నాయి. సంక్రాంతి సెలవుల తర్వాత షెడ్యూల్‌ ప్రకారం అయితే ఈ నెల 17వ తేదీ నుంచి అన్ని స్కూళ్లు, విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోవాల్సి ఉంది. కానీ, మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకుంటాయా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోవడమే. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి విద్యాసంస్థల ప్రారంభంకావడంపై సందేహం నెలకొంది. వాస్తవానికి సంక్రాంతి ముందే షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 11 నుంచి స్కూళ్లకు, 13వ తేదీ నుంచి కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. దానిని ముందుకు జరిపి.. ఈ నెల 8 నుంచే విద్యాసంస్థలకు సర్కార్ సెలవులు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా.. 17న తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది.

also read :-కర్షకా ఆనందం.. రైతు బంధు సంబురాలు

అంతర్గతంగా ఆదేశాలు

రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా విద్యా సంస్థలు ఆన్​లైన్​ క్లాసులకు నిర్ణయం తీసుకున్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 17 నుంచి ఇంజినీరింగ్​ కాలేజీలన్నీ ఆన్​లైన్​ క్లాసులను నిర్వహిస్తున్నట్లు విద్యార్థులకు సమాచారం పంపించాయి. ఈ నెల 16న అంటే ఆదివారం జూమ్​లింకులను ఇస్తున్నామని, కాలేజీల షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి సమయం ప్రకారం క్లాసులు నిర్వహిస్తున్నట్లు మెస్సెజ్‌ల్లో వివరించారు. అయితే సెమిస్టర్​వారీగా విద్యార్థులకు ఆఫ్​లైన్‌లో కొన్ని పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రస్తుతానికి నిర్ణయించారు. ఇంజినీరింగ్​కాలేజీల్లో ఫస్ట్​ ఇయర్​విద్యార్థులకు ఫస్ట్, సెకండ్ సెమిస్టర్ క్లాసులను ఆన్​లైన్‌లో నిర్వహిస్తుండగా.. థర్డ్, ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు మాత్రం ఆఫ్​లైన్‌లో ఉంటాయని వెల్లడించారు. దీనికి కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఆఫ్​లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, ఈ పరీక్షలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

పాఠశాలలు, ఇంటర్​ కాలేజీలకు కూడా..?

రాష్ట్రంలో పాఠశాల విద్యతో పాటుగా ఇంటర్, ఆపై తరగతుల కాలేజీలకు కూడా మొత్తం ఆన్​లైన్ క్లాసులు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఇంజినీరింగ్​ విద్యార్థులకు మాత్రమే సమాచారమిచ్చారు. ఆదివారం నుంచి విద్యార్థులందరికీ ఆన్​లైన్ క్లాసులపై సమాచారం ఇవ్వనున్నట్లు విద్యాసంస్థల నిర్వాహకులు చెప్పుతున్నారు.