Telugu News

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసిన టీఎన్జీవోస్ కార్యవర్గం

== అందరికి బుకేను అందించి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

0

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసిన టీఎన్జీవోస్ కార్యవర్గం
== అందరికి బుకేను అందించి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
(ఖమ్మం-విజయంన్యూస్)

నూతన సంవత్సర వేడుకలో భాగంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్ అఫ్జల్ హసన్ ,కార్యదర్శి ఆర్వీ.ఎస్.సాగర్ లతో పాటుగా తాలూకా,యూనిట్,ఫోరమ్ ల కమిటీ సభ్యులు శనివారం ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధుల స్వగృహాలకు వెళ్లి పులా మొక్కలను బహుకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ముందుగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్ అఫ్జల్ హసన్,కార్యదర్శి ఆర్వీ.ఎస్.సాగర్ కు కలెక్టరేట్ లోని టీఎన్జీవోస్ కార్యాలయం వద్దకు తాలూకా,యూనిట్, ఫోరమ్ ల కమిటీ సభ్యులు చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, అడిషనల్ కలెక్టర్ మధుసూధన్, సిపి విష్ణు యస్.వారియర్, అడిషనల్ డిసిపి చంద్రబోస్, ఏసీపీ లు రామోజీ రమేష్, రామానుజం .సిఐ లు అంజలి సురేష్ లను
మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించి, శాలువతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నగర మేయర్ పూనుకొలు నీరజ సుదా ఛైర్మెన్ బచ్చు విజయకుమార్ లను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్లల ను బహుకరించి, శాలువతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి భాగం పవన్,అసోసియేట్ అధ్యక్షులు వీర నారాయణ, వైస్ ప్రెసిడెంట్ నందగిరి శ్రీను,దాసరి రవి కుమార్,తాడేపల్లి కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ రెంటాల సమత, జాయింట్ సెక్రెటరీ చిట్టిప్రోలు రమణ, కట్టగూరు సైదులు, చింతకాయల కృష్ణ, వాసన్ రవికుమార్, టి.వెంకటేశ్వర్లు,జాయింట్ సెక్రెటరీ ఉమెన్ ఎల్లంపల్లి శాంత కుమారి,ఆర్గనైజింగ్ సెక్రెటరీ కూరపాటి శ్రీనివాస్, పబ్లిసిటీ సెక్రెటరీ కెవి వి.ప్రసాద్,ఆఫీస్ సెక్రెటరీ కరణ్ సింగ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ బుద్ధ రామకృష్ణ,ఎగ్జిక్యూటివ్ మెంబెర్ కోళ్లపల్లి అచ్యుతారావు, జ్వాలా నరసింహారావు,ఎస్వీ. ఆర్. ఎన్.రాజు,కాల్వ విపుల్ జైన్, కె.పెద్ద పుల్లయ్య లు కలరు. ఖమ్మం టౌన్ యూనిట్, నేలకొండపల్లి యూనిట్, వైరా యూనిట్, మధిర యూనిట్, కల్లూరు యూనిట్, సత్తుపల్లి యూనిట్ నుంచి అధ్యక్ష,కార్యదర్శులు, సభ్యులు హాజరైయ్యారు.

ALSO READ :-మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి