Telugu News

రాష్ట్రంలో సుపరిపాలన అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం: హోంమంత్రి 

తహశీల్దార్, పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, మైమూద్ అలీ

0

రాష్ట్రంలో సుపరిపాలన అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం: హోంమంత్రి 

== తహశీల్దార్, పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, మైమూద్ అలీ

== *▪️రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్.. రూ.50 లక్షలతో తహశీల్దార్ కార్యాలయం..*

(ఖమ్మం-విజయం న్యూస్)

నూతనంగా నిర్మించిన ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం భావనలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మైమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి:- నిరుపేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం:మంత్రి పువ్వాడ 

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా శనివారం మంత్రులు లాంఛనంగా ప్రారంభించి సబ్ ఇన్స్పెక్టర్ మాచినేని రవి, తహశీల్దార్ నర్సింహ రావు లను తమ సీట్ లో కూర్చోబెట్టారు.

రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్ , రూ.50 లక్షలతో తహశీల్దార్ భావనలు నిర్మించి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రారంభించుకోవడం పట్ల మంత్రి మైమూద్ అలీ  హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:- వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

రాష్ట్రంలో సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే నూతన మండలాలు, నూతన గ్రామాలు ఎర్పాటు చేసుకుని తమ గ్రామాలను తామే పలించుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరుగుతుందన్నారు.