పేదలకు నాణ్యమైన వైద్యం అందించమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి
== పేదలకు మరింత చేరువ చేయాలనే బస్తిదావాఖనలు..
== బస్తీ దవాఖనను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
పేదలకు నాణ్యమైన వైద్యంను మరింత చేరువ చేసేందుకే బస్తీలలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం 37వ డివిజన్ పాత మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో రూ.4.98 లక్షలతో ఏర్పాట చేసిన బస్తీ దవాఖానను మంత్రి పువ్వాడ ప్రారంబించారు.
allso read- మానవత్వం ఇమిడి ఉన్న కార్యక్రమం ‘కంటి వెలుగు’: మంత్రి
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పేద, మద్యతరగతి కుటుంభాలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు రాష్టప్రభ్తుత్వం బస్తీ దవఖానాలను ఏర్పాటు చేస్తుందని, ప్రజలందరు సద్వినియోగం చేసుకుకోవాలన్నారు. వైద్యం కోసం పేద ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా బస్తీలలో దవఖానాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవఖానాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ప్రస్తుతం చిన్న, చిన్న అనారోగ్య సమస్యలకు కూడా పైవేటు ఆసుపత్రులలో వేలాదిరూపాయల ఖర్చు అవుతుందన్నారు. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా పేదల ఆరోగ్యం కోసం ఆలోచించలేదని బీఆర్ఎస్ ప్రభత్వం పేదల ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గుర్తుచేశారు.
allso read- ఖమ్మం నగరం రాష్ట్రానికే ఆదర్శం..మంత్రి పువ్వాడ.
కార్పోరేట్ వైద్యాన్ని పేదలకు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా బస్తీలలో దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కార్పోరేషన్ పరిధిలో మరిన్ని దవాఖానలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కమిషనర్ మల్లీశ్వరి, డీఈ నవ్య జ్యోతి, అధికారులు, నాయకులు, వైద్యులు ఉన్నారు.