Telugu News

కార్మిక, కర్షకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:మంత్రి

మేడే ర్యాలీలో పాల్గొని మాట్లాడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

0

కార్మిక, కర్షకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:మంత్రి

== మేడే ర్యాలీలో పాల్గొని మాట్లాడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల కోసం వీరోచిత పోరాటం చేసి హక్కులను సాధించుకున్నారని, వారి పోరాట స్ఫూర్తితో కార్మిక, కర్షకుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనునిత్యం పని చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Allso read:- సీఎంను కలిసిన మంత్రి పువ్వాడ

ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా సోమవారం ఖమ్మం నగరం 3టౌన్ మిర్చి మార్కెట్ వద్ద గల బీఆర్ఎస్ కేవీ సంఘం కార్యాలయంలో కార్మిక జెండా ను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధ్వర్యంలో సుమారు 3వేల మంది మార్కేట్ కార్మికులకు ఏకరూప దుస్తులను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు. నగరంలోని పలు చోట్ల బీఆర్ఎస్ కేవీ జెండాలను ఆవిష్కరించారు.

ఇది కూడా చదవండి:- నూతన సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన మంత్రి పువ్వాడ..

మిర్చి మార్కెట్ నుండి ర్యాలీగా పంపింగ్ వెల్ రోడ్, గాంధీ గంజ్, గాంధీ చౌక్, పీఎస్ఆర్ రోడ్, గుంటి మల్లన్న టెంపుల్ రోడ్, నయా బజార్ సెంటర్, జూబ్లీ క్లబ్, బ్రిడ్జి మీదుగా మయురి సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్, జడ్పి సెంటర్, ఇల్లందు సర్కిల్ నందు సభ, జమ్మిబండ, బోనకల్ x-రోడ్, చర్చ కాంపౌండ్ మీదగా మిర్చి మార్కెట్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన కొనసాగింది.

ఈ సందర్భంగా ఇల్లందు సర్కిల్ నందు జరిగిన సభలో వారు మాట్లాడుతూ…

ఇది కూడా చదవండి:- పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన సచివాలయం: మంత్రి పువ్వాడ

కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్  నాయకత్వంలోని టి.ఆర్.ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

నగరం విస్తరిస్తుంది, నగరంలో అద్భుతంగా రోడ్లు విస్తరించినం, ప్రయాణ సౌకర్యాలు పెంచినం, అనేక మందికి కార్మికులకు వివిధ రూపాల్లో ఉపాధి పెంచినం అని అన్నారు.

వ్యవసాయ మార్కెట్ అభివృద్ది చేసినం, కార్మికులకు సౌకర్యాలు పెంచినం, సేవలను విస్తరించిన అని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వెల్ఫేర్ బోర్డ్ ద్వారా కార్మికులకు ఎవరికైనా ప్రమాదం జరిగితే రూ.6 లక్షలు, ఇంట్లో పెళ్లి అయితే రూ.30 వేలు, ప్రమాదం జరిగితే ఆదుకుంటుందని అన్నారు.

ఇది కూడా చదవండి:- పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ

ఖమ్మం లో ఈఎస్ఐ ఆసుపత్రిని తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల చికిత్సలను ఉచితంగా అందిస్తామని అన్నారు.

వచ్చే ఆరు నెలలు ఆటో కార్మికులు నోరు తెరవాలసిన అవసరం ఉందన్నారు. మనం చేసుకున్న అభివృద్ది గూర్చి వివరించాలని కోరారు.

సంఘటిత, అసంఘటిత రంగాలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి సమానంగా కృషి చేస్తోందని వివరించారు. నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమానికి బోర్డు ద్వారా ప్రతి ఏడాది కోట్ల రూపాయల లబ్ది చేకూర్చినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక జాతీయ అవార్డులను కైవసం చేసుకుందని, కార్మికులకు ఎక్కడి నుంచి అయినా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభించిందన్నారు.

ఇది కూడా చదవండి:- అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి పువ్వాడ

దేశ ప్రగతికి పారిశ్రామిక అభివృద్ధి గీటురాయి అని ఇందులో కార్మికులు, శ్రమ జీవులే భాగస్వాములని ఆయన పేర్కొన్నారు.

కార్మికులు అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని వెల్లడించారు.

కేసీఅర్, కెటిఆర్ నాయకత్వంలో నా తెలంగాణ ఎనిమిదేండ్ల స్వరాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సాక్షిగా అమెరికా తరువాత అంతర్జాతీయ కంపెనీలు తమ తమ వ్యాపార కార్యకలాపాలకు రెండవ కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావడం వల్ల అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలు మన వద్దకు వస్తున్నాయని, తద్వారా కార్మికులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతాప్రమాణాలతో కూడిన ఉపాధి, వేతనం లభిస్తోందన్నారు.

ఇది కూడా చదవండి:- కేసీఅర్ నీ గద్దె దింపే దమ్ము నీకుందా: మంత్రి పువ్వాడ

ఈ విధంగా కార్మికులకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కార్మికుల సంపూర్ణ సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.

మరోసారి కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.