Telugu News

సకల జనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి

తెలంగాణలో మత సామరస్యాన్ని చాటి చెబుతోంది

0
సకల జనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి
== తెలంగాణలో మత సామరస్యాన్ని చాటి చెబుతోంది
== అభివృద్ధితో పాటు పలు సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేస్తున్నాం
== మైనార్టీ బందు పథక లబ్దిదారులకు చెక్కులను మంజూరు చేసిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం,అక్టోబర్ 5(విజయంన్యూస్)

సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు.  గురువారం వీడిఓస్‌ కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న మైనార్టీ బందు-120 పథకం ద్వారా మంజూరైన చెక్కులను మంత్రి  లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్‌ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం.

తెలంగాణ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (టిఎస్‌ఎంఎఫ్‌సి)  అధ్వర్యంలో మైనారిటీ నిరుద్యోగ యువతకు జీవనోపాధి పొందడానికి ప్రవేశపెట్టిన నిరుద్యోగ యువతకు అందిస్తున్న డ్రైవర్‌ కం ఓనర్‌ పథకం ద్వారా మంజూరైన రెండు కార్లను మంత్రి లబ్ధిదారులకు అందించారు. మైనర్టీ సంక్షేమ శాఖ ద్వారా ఖమ్మం కు మంజూరైన 400 కుట్టు మిషన్‌లను మంత్రి మహిళలకు పంపిణి చేశారు. ఈ సందర్భం గా మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనిక పాలన, తెలంగాణలో హిందూ, ముస్లిం ఐక్యతను పటిష్టం చేస్తూ, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతోందన్నారు.
మైనారిటీలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి క్యాబ్స్‌ వాహనాలు, వంద శాతం సబ్సిడీతో ఆర్ధిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు.  చదువుకొని నిరుద్యోగులుగా    ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో యువతకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ప్రభుత్వం వాహనాలను అందజేయడం జరిగిందని అన్నారు.  మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని భావించి మైనార్టీ శాఖ అధ్వర్యంలో 200 మంజూరు చేయగా ముఖ్యమంత్రి కేసీఅర్‌  దృష్టికి తీసుకెళ్ళి  ఖమ్మంలో ప్రత్యేకంగా 400 కుట్టు మిషన్‌ లను మంజూరు చేయించి  పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.మైనారిటీలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి క్యాబ్స్‌ వాహనాలు, వంద శాతం సబ్సిడీతో ఆర్ధిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో యువతకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ప్రభుత్వం వాహనాలను అందజేయడం జరిగిందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని భావించి మైనార్టీ శాఖ అధ్వర్యంలో 200 మంజూరు చేయగా ముఖ్యమంత్రి కేసీఅర్‌ దృష్టికి తీసుకెళ్ళి ఖమ్మంలో ప్రత్యేకంగా 400 కుట్టు మిషన్‌ లను మంజూరు చేయించి పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ పొందిన మైనారిటీ మహిళలకు పంపిణి చేస్తున్నామని వివరించారు. ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, కుట్టు మిషన్‌ ల ద్వారా చిన్న మొత్తంలో సంపాదన వచ్చినా ఇంట్లో పిల్లలకు ఫీజులు, కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందన్నారు. అభివృద్ధితో పాటు పలు సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేస్తూ వారు ఆర్థికంగా బలోపేతం చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను అందజేసి రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి అండగా నిలబడిరదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకుంటున్నా రాష్ట్ర తెలంగాణ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సెక్యులర్‌ వైఖరి, తెలంగాణలో మత సామరస్యాన్ని చాటి చెబుతోందన్నారు.
మైనారిటీల సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్రమూ తెలంగాణ స్థాయిలో బడ్జెట్‌ కేటాయింపులు చేయలేదని వివరించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సత్య ప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహార,వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దోరేపల్లి శ్వేత, జెడ్పీటీసీ ప్రియాంక, కార్పొరేటర్‌ కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళీ, పాకాలపాటి విజయనిర్మల, ఆలియ, మక్బూల్‌, చిరుమామిళ్ళ లక్ష్మీ, దాదే అమృతమ్మ, పగడాల శ్రీవిద్య, వలరాజ్‌, పాలేపు విజయ, అశ్రిఫ్‌, ఖమర్‌, తాజుద్దీన్‌, నాగులమీరా, షేక్‌ షకీన, ఇస్సాక్‌, తౌసిఫ్‌(బాబీ), షంశుద్దిన్‌ తదితరులు ఉన్నారు.