Telugu News

క్రీడాకారులందర్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ

క్రీడాకారులకు బహుమతులను అందజేసిన మంత్రి పువ్వాడ అజయ్ 

0
క్రీడాకారులందర్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ
== క్రీడాపోటీల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
== క్రీడాకారులకు బహుమతులను అందజేసిన మంత్రి పువ్వాడ అజయ్ 
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా  నుండి ఎంపికయి రాష్ట్ర స్థాయి పోటీలలో మెడల్స్‌ సాధించిన క్రీడాకారులను  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, జిల్లా  కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌తో కలిసి క్రీడాకారులను అభినందించారు.  సి.ఎం.కప్‌`2023 రాష్ట్ర స్థాయి అథ్లెటిక్‌, ఆర్చరీ, వెయిట్‌ లిఫ్టింగ్‌, లాన్‌ టెన్నీస్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ పోటీలలో జిల్లా స్థాయిలో నుండి ఎంపికయి రాష్ట్ర స్థాయిలో పోటీ పడి అథ్లెటిక్‌ విభాగంలో ఏ.మైథిలి 400 మీటర్ల పోటీలో గోల్డ్‌ మెడల్‌, షాట్‌ఫుట్‌లో హజీరా ఫాతీమా సిల్వర్‌ మెడల్‌, లాంగ్‌జంప్‌లో ఎస్‌.కె.అఫ్రీన్‌ బ్రోన్జ్‌ మెడల్‌, 100 మీటర్స్‌ విభాగంలో ఎస్‌.కె.లాల్‌పాషా సిల్వర్‌ మెడల్‌, షాట్‌పుట్‌ విభాగంలో ఎస్‌.కె.మజిద్‌పాషా సిల్వర్‌ మెడల్‌, ఆర్చర్రీ 30 మీటర్స్‌ విభాగంలో బి.అనిల్‌ బ్రొంజ్‌మెడల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కెజిస్‌ విభాగంలో బి.శ్రీహరి గోల్డ్‌ మెడల్‌, 55 కె.జిస్‌లో కె.అభిరామ్‌ బ్రొంజ్‌మెండల్‌, 61 కె.జిలో వి.హరీష్‌ సిల్వర్‌ మెడల్‌, లాన్‌ టెన్నీస్‌  సింగిల్స్‌ విభాగంలో ఎం.రామరాయలు గోల్డ్‌ మెడల్‌, కె.స్పప్నీల్‌ బ్రొంజ్‌ మెడల్‌, డబుల్స్‌లో ఎం.రామరాయలు, బి.అరుణ్‌లు గోల్డ్‌ మెడల్‌, డబుల్స్‌ విభాగంలో జి.సమిత్‌ కుమార్‌,  కె.స్వప్నిల్‌ బ్రొంజ్‌ మెడల్‌, మహిళా ఫుట్‌బాల్‌ విభగాంలో తీమ్‌ గోల్డ్‌ మెడల్‌, మహిళ కబడ్బి విభాగంలో తీమ్‌ బ్రొంజ్‌ మెడల్స్‌ విజేతలను సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన అవతరణ దశాబ్ది ఉత్సవాలలో క్రీడాకారులు సాధించిన మెడల్స్‌ను అందించి అభినందించారు.  పోలీసు కమీషనర్‌ విష్ణు.యస్‌.వారియర్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి, కోచ్‌లు, విజేతలు పాల్గొన్నారు.