Telugu News

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి :-మొక్క శేఖర్ గౌడ్

ఖమ్మం-విజయం న్యూస్

0

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి :-మొక్క శేఖర్ గౌడ్
(ఖమ్మం-విజయం న్యూస్)
ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేయాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం నాడు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి లొ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని కిసాన్‌ కాంగ్రెసు అధ్వర్యంలో సందర్శించినారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు రైతులు తమ వడ్లని అక్కడే పెట్టి కాటా కోసం ఎదురు చూస్తున్నారని
అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి మొలకలు వచ్చినదని . వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయని. అధికారులు నత్తనడకన కొనుగోలు కేంద్రాలు నడిపిస్తున్నారని వీలైనంత వరకు ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలని తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తరుగుపేరుతో దోచుకున్న వారిని కఠినంగా శిక్షించాలని

also read :-ఎమ్మెల్యే శంకర్ నాయక్ కె కరోనా పాజిటివ్
తామర పురుగు మరియు అకాల వర్షాల వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మిర్చి రైతులకు ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ఇరవై లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని
తక్షణమే వ్యవసాయశాఖ అధికారులను క్షేత్రస్థాయిలో పంపి సర్వే జరిపించిరైతులకు నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయాలని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పోలేపల్లి సర్పంచ్ బత్తుల నాగరత్నం గోళ్లపాడు మాజీ సర్పంచ్ మద్దివీరా రెడ్డి .జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు బత్తుల కూర్మారావు సన్నీళ్ళా వెంకటేష్ .పోలేపల్లి ఉపసర్పంచ్ గార్ల శేఖర్ ఆడెపు వెంకట్రామయ్య .గార్ల సతీష్ . చీకటి దుర్గయ్య బూరుగడ్డ రామాంజనేలు గార్ల మహేష్ . సందీప్ .పోకబత్తిని రాములు పొన్నెగంటి వెంకన్న మరియు పోలిేపల్లి రైతులు పాల్గొన్నారు