Telugu News

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి:కాంగ్రెస్ 

కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి*

0

*ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి:కాంగ్రెస్ 
*👉🏻 కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి*
*👉🏻 ముఖ్య అతిథులుగా టి పి సి సి ఉపాధ్యక్షులు,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరావులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలోజాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.

ఇది కూడా చదవండి:- తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే: పువ్వాళ్ళ

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పంట అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ప్రభుత్వం వారికి అండగా నిలవాలని అన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలతో ఇప్పటికే రైతులు నష్ట పోయి ఉన్నారని ధాన్యం కొనుగోలు దగ్గర వారు మోసపోకుండా చూడాలని అన్నారు.నెల రోజుల నుంచి రైతులు దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ప్రభుత్వం దాన్యం కొనుగోలు విషయంలో చాలా నిర్లక్ష్యంగా నిదానంగా వ్యవహరిస్తుందని అన్నారు.

ఇది కూడా చదవండి:- ఆత్మహత్యలు లేని తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం: భట్టి విక్రమార్క

అకాల వర్షాలు వచ్చి రైతులు దాన్యం మొత్తం తడిసిపోయింది రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టడం పోగు చేసుకోవడమే సరిపోతుందని అన్నారు. చాలావరకు ధాన్యం తడిసి మొక్కలు వస్తున్నాయి రాత్రిపూట రైతులు ధాన్యం దగ్గర ఉన్నప్పుడు పాములు తేళ్లు మరియు పిడుగులు పడి చనిపోయే ప్రమాదం ఉన్నది కావున వీలైనంత త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలి అదేవిధంగా తరుగు పేరుతో రైతులను దోచుకోకుండా చూడాలని అక్రమాలకు పాల్పడిన అధికారులపై మరియు మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.

ఇది కూడా చదవండి:- బిఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు: భట్టి

వడగళ్ళు వానకు నష్టపోయిన రైతులను అదుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్స్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఇన్చార్జీలు ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి భుక్యా చంద్రకళ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు డానియల్ జావిద్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు శీలం బ్రహ్మారెడ్డి రావురు పుల్లారావు దిద్దుకూరు వెంకటేశ్వర్లు గోవిందరావు మలిదు వెంకటేశ్వర్లు మద్ది వీరారెడ్డి .బాణా లక్ష్మణ్ .బోడా తావురియా. చంద్రగిరి నగేష్ .వెంకట్ నారాయణ సయ్యద్‌ హుస్సేన్ . ధరావత్ వాలి. బుక్య బాలాజీ బచ్చలకూర నాగరాజు గజ్జెల్లి వెంకన్న
తదితరులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి:- సోమేషా..ఆనందమేందుకు..? :భట్టి