గ్రామపంచాయతీ ట్రాక్టర్ ప్రైవేట్ పనులకు
== పండుగులకు, ప్రైవేట్ పనులకు పంచాయతీ ట్రాక్టర్
== ట్యాంకర్ పై గ్రామపంచాయతీ పేరు లేకుండా ప్రైవేటు ఇంజన్ సహకారంతో నీళ్ల వ్యాపారం..
== మండల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోపణలు.
(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)..
గ్రామీణ పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వ సంకల్పానికి కొందరు గ్రామపంచాయతీ అధికారులు నీరు కారుస్తున్నారు. గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడంతోపాటు, హరితహారం, పల్లె ప్రకృతి వనం లాంటి మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లు నేడు ప్రైవేట్ వ్యక్తుల పండగలలో బిజీగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో కొన్న ట్రాక్టరే కదా అని కొందరు తమ సొంత ట్రాక్టర్‌లా భావిస్తున్నట్లుంది. మేము ఏమి చేసినా నడుస్తుంది అనే కొందరు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ వనరులను ఉపయోగించి సొమ్ము చేసుకునే ప్రయత్నం, కొంత బంధు ప్రీతి చూపిస్తున్న సంఘటన గురువారం తిరుమలాయపాలెం మండలంలో కాకరవాయి గ్రామంలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: ‘పాలేరు’లో మద్యం దందా..?
మరోవైపు మొక్కల సంరక్షణకు వాటర్ నీటి ట్యాంకులతో నీరు పోస్తూ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా కాకరవాయి గ్రామపంచాయతీలో అవి సొంత పనులకు ఉపయోగిస్తుండడం.. దీనికి గ్రామ పంచాయతీ అధికారిని సహకరించడం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్, నీటి వాటర్ ట్యాంక్ ను అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఉపయోగించినట్లు తెలుస్తుంది. ట్రాక్టర్ను గుర్తుపట్టకుండా ట్యాంకర్ పై గ్రామపంచాయతీ పేరు కూడా లేకుండా ఓ ప్రైవేట్ ట్రాక్టర్ ఇంజన్ కి ట్యాంకర్ ను తగిలించుకొని ఉపయోగిస్తుండడం ఇక్కడ కొసమెరుపు.. చేసి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీల నిధుల నుండి నెలవారీగా ఈఎంఐ రూపంలో లోన్ చెల్లిస్తుంటే కాకరవాయి గ్రామపంచాయతీ ట్రాక్టర్ మాత్రం బయట ప్రైవేట్ కార్యా కలపాలకు ఉపయోగిస్తున్న పట్టించుకునే నాధుడే లేకపోయాడు. ఖర్చు గ్రామపంచాయతీలది లబ్ది మాత్రం గ్రామపంచాయతీ అధికారులదైంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో కష్టపడేవారికి పదవులు రావడం ఖాయం
== ప్రజల కోరిక మేరకు ఇచ్చాము..: పావని, పంచాయతీ కార్యదర్శి
పంచాయతీ ట్రాక్టర్ ను ఎవరికి ఇవ్వోద్దు.. పంచాయతీ పనులకు మాత్రమే ఉపయోగించాలి.. కానీ గ్రామస్థుల కోరిక మేరకు ఉప్పలమ్మ పండుగలు చేస్తుంటే ట్యాంకర్ ను సర్పంచ్ పంపించారు.. ఇక నుంచి అలాంటి పరిస్థితి రాకుండా చూస్తాం.