Telugu News

తాతా మధుసూధన్ విజయం ఖాయం..

రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేసిన తాతామధు

0

తాతా మధుసూధన్ విజయం ఖాయం..

**రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేసిన తాతామధు.

** హాజరైనా ప్రభుత్వ విఫ్ రేగా, ఎమ్మెల్యేలు సండ్ర, కందాళ, హరిప్రియా, ఎమ్మెల్సీ పల్లా.

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టిఆర్ఎస్ అభ్యర్థిగా తాత మధు మంగళవారం మరో సెట్ నామినేషన్ ను దాఖలు చేశారు. సోమవారం మొదటి సెట్ నామినేషన్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,జిల్లా పరిషత్ చైర్మనలు లింగాల కమల్ రాజు, కోరం కనకయ్య తో కలిసి దాఖలు చేసిన తాత మధుసూదన్ మంగళవారం ఉదయం మధ్యాహ్నం 12గంటలకు రెండో సెట్ ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నాయకులతో కలిసి దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించడం జరిగిందని, సుమారు 75 పర్సెంట్ ఓటర్లు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారని అన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడక అని ఆయన అన్నారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పాటు ఖమ్మం జిల్లాను ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కెసిఆర్ ఆశీర్వదించి తాతా మధు ను అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగిందని, ఆయన నిర్ణయం మేరకు మేమంతా ఐక్యంగా ఉండి మంచి మెజారిటీతో తాతా మధుసూధన్ ను గెలిపించి సీఎం కేసీఆర్ కానుకగా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలని, ఏకగ్రీవంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాత మధుసూదన్ గెలిపించి, సీఎం కేసీఆర్ కు కానుకగా ఇస్తే మరింతగా ఉమ్మడి ఖమ్మంజిల్లాను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, అందుకే ప్రతిపక్ష పార్టీలన్నీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ అన్ని పార్టీలు ఆలోచించి తమ నామినేషన్లను విత్డ్రా చేసుకోవాలని కోరారు.

also read :- ఖమ్మం స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థి రాయల నామినేషన్ దాఖలు..

స్థానిక సంస్థలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తామని, ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. అభ్యర్థి తాతా మధు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు టిక్కెట్ కేటాయించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. నా కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి హరిప్రియ నాయక్ చైర్మన్లు తదితరులు హాజరయ్యారు.