Telugu News

పార్టీని నడపలేని దద్దమ్మ రాహుల్ గాంధీ: మంత్రి

ఆదర్శ పాలన అందించే ప్రభుత్వానికే సలహాలిస్తారా..?

0

పార్టీని నడపలేని దద్దమ్మ రాహుల్ గాంధీ: మంత్రి

== ఆదర్శ పాలన అందించే ప్రభుత్వానికే సలహాలిస్తారా..?

== కాంగ్రెస్ పై మండిపడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== కేసీఅరే మనకు గ్యారెంటి.. బీఆర్ఎస్ ప్రభుత్వమే మనకు వారెంటీ.

== మండలంలో ప్రతి పథకం ద్వారా నిధులు కుమ్మరించి అభివృద్ది చేసిన

== పథకాలు అమలు చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి

== రఘునాథపాలెం మండలంలో వేయ్యికొట్లతో అభివద్ది పనులు

== స్పష్టం చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(రఘునాథపాలెం-విజయంన్యూస్)

కాంగ్రెస్ పార్టీని నడపలేక, చాతగాని తనంతో  అధ్యక్షపదవికి రాజీనామా చేసి విదేశాలకు పరారైన దద్దమ్మ రాహుల్ గాంధీ అని, దేశానికే ఆదర్శనీయమైన పథకాలను అందిస్తూ ప్రజారంజక పరిపాలన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమ్మర్శించారు.

ఇది కూడా చదవండి:- చచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ: మంత్రి కేటీఆర్

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం చిమ్మపుడి గ్రామంలో రూ.1.10కోట్లు, కోటపాడు గ్రామంలో రూ.1.32కోట్లతో మొత్తం రూ.2.42కోట్లతో ఎర్పాటు చేసిన పలు అభివృద్ది పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.చిమ్మపుడి, కోటపాడు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మంత్రి పువ్వాడ కు స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నడుమ రోడ్ షో చేస్తూ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మండలం లోని గ్రామాల్లో జరిగిన అభివృద్దిపై రూపొందించిన ప్రగతి నివేదిక పాంప్లేట్ ను ఆవిష్కరించారు. చిమ్మపుడి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.85లక్షలతో 16 సీసీ రోడ్లు, 3 సీసీ డ్రైన్ ల నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.10లక్షలతో నిర్మించిన మూడు సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. సీఎస్ఆర్ ట్రాన్స్ కో నిధులు రూ.12 లక్షలతో రెండు డొంక రోడ్లను విస్తరించి అభివృద్ది చేసిన మట్టి రోడ్లను ప్రారంభించారు. సుడా నిధులు రూ.3.50 లక్షలతో ఎర్పాటు చేసిన హై-మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు.

ఇది కూడా చదవండి:- దేశంలో కేసీఆర్ ను మించిన రైతు నాయకుడు లేడు:నామ

కోటపాడు గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.10లక్షలతో నిర్మించిన రెండు సీసీ సైడ్ డ్రైన్లు, ఒక సీసీ రోడ్డును ప్రారంభించారు. సీఎస్ఆర్ ట్రాన్స్ కో  నిధులు రూ. 17లక్షలతో రెండు డొంక రోడ్లను మట్టి రోడ్లుగా విస్తరించి అభివృద్ది చేసిన రోడ్లను వారు ప్రారంభించారు. రూ.40 లక్షలతో నిర్మించనున్న బ్లాక్ టాప్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సుడా నిధులు రూ.3.50 లక్షలతో గ్రామ సెంటర్ లో ఎర్పాటు చేసిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.62లక్షలతో నిర్మించిన 13-సీసీ రోడ్స్ లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. కేసీఅరే మనకు గ్యారెంటి.. బీఆర్ఎస్ ప్రభుత్వమే మనకు వారెంటీ అని అన్నారు. అమ్మకు అన్నమే పెట్టడు కానీ చిన్నమకు మాత్రం బంగారు గాజులు చేపిస్తడంట.. అయితదా..అని ప్రశ్నించారు. 75 సంవత్సరాల భారతదేశంలో ఎక్కువ పర్యాయాలు పాలించింది కాంగ్రెస్ కాదా.. ఎం చేశారు ఇప్పటి వరకు. ఎందుకు గ్రామాలు అస్తవ్యస్తంగా ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. మండలంలో ప్రతి పథకం ద్వారా నిధులు కుమ్మరించి అభివృద్ది చేశామని తెలిపారు. గ్యారెంటిలు, వారెంటిలు ఇస్తాం అని చెప్పి ప్రజలను మోసం చేసింది చాలు అని వారికి అర్దం అయ్యేలా చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్  ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఆయన అంటాడు రేవంత్ రెడ్డి 3 గంటలు చాలు అని..

ఇది కూడా చదవండి:- వారంటీ లేని కాంగ్రెస్ ను తరమికొట్టాలే: కేటీఆర్

అయితదా..అని ప్రశ్నించారు. 75 సంవత్సరాల భారతదేశంలో ఎక్కువ పర్యాయాలు పాలించింది కాంగ్రెస్ కాదా.. ఎం చేశారు ఇప్పటి వరకు. ఎందుకు గ్రామాలు అస్తవ్యస్తంగా ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. మండలంలో ప్రతి పథకం ద్వారా నిధులు కుమ్మరించి అభివృద్ది చేశామని తెలిపారు. గ్యారెంటిలువారెంటిలు ఇస్తాం అని చెప్పి ప్రజలను మోసం చేసింది చాలు అని వారికి అర్దం అయ్యేలా చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్  ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఆయన అంటాడు రేవంత్ రెడ్డి 3 గంటలు చాలు అని.. అయితదా.. మూడు గంటల్లో పారుతదా ఎకరం భూమి.. తలతిక్క మాటలు చెప్పే వాళ్ళను మీరు కచ్చితంగా అడగాలి మీరు. ఒక్క కోటపాడు గ్రామంలోని రూ.8.14కోట్లు ఇచ్చినం. ఇవి ఢిల్లీ నుండి రాహుల్ గాంధీ దగ్గర తీసుకొచ్చిన నిధులు కాదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు. రఘునాధ పాలెం మండలంలో ఇప్పటి వరకు రూ.350కోట్లు ఇచ్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసినం.

ఇది కూడా చదవండి:- ఖమ్మం నగరం.. అభివృద్ధి గుమ్మం: పువ్వాడ 

ఇప్పుడే మండలంలోని 22 గ్రామాలలో రోడ్ల కోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.3కోట్లు మంజూరుకు సంబందించి జిఓ వచ్చింది. త్వరలో ఆయా నిధులు మండలంలోని ఆయా గ్రామాలకు కేటాయించి మరిన్ని రోడ్లు వేస్తామని స్పష్టం చేశారు. మీరేం చేశారు ఇప్పటివరకు.  ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు. కేసీఅర్ గారు 2వేల పెన్షన్ ఇస్తుంటే కాంగ్రెస్ రూ.4 వెలు ఇస్తాం అంటున్నారు.. ఇన్నాళ్లు ఎం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వలేని వాడు తెలంగాణలో ఇస్తారా..? మీరు ప్రభుత్వంలో  ఉన్నపుడు ఎం చేశారు.. గ్రామాల అభివృద్ధి కోసం ఎం చేశారు… తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు.. ఇప్పుడు తగుదునమ్మా అంటు దండాలు దస్కాలు పెట్టీ వస్తారు..

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ గెలుపే అభివద్దికి మలుపు: మంత్రి కేటీఆర్

పుట్టగతులు లేని కాంగ్రెస్ పార్టీ, ప్రజలు చిత్కరించిన కాంగ్రెస్ మళ్ళీ వస్తుందన్నారు. ఆ దద్దమ్మలు బీఆర్ఎస్ శ్రేణులు గెట్టిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. పార్టీని సక్కగా నడపలేని దద్దమ్మ రాహుల్ గాంధీకి ఇచ్చిన అధ్యక్ష పదవి మల్లికార్జున కి ఇచ్చిన ఈయనా మనకు చెప్పేదని విమ్మర్శించారు. వారంటి లేని.. గ్యారెంటి లేని పార్టీల పిట్ట అరుపులు, ఉడత ఊపులు ఇక్కడ కాదు.. వాళ్లకు ఏది చేత కాదని దుయ్యబట్టారు. ఎవరిని ఎడగనివ్వరు. ఒకడు పంచ లాగుతారు.. ఒకడు ప్యాంటు లాగుతాడు.. వీళ్ళా మనకు ఇచ్చేది గ్యారెంటని విమ్మర్శించారు. ఆచరణ సాధ్యం కాని అమలు చేయలేని పార్టీలు దొంగ హామీలు ఇవ్వడం తేలికే.. వాటిని అమలు చేయాలంటే కేసీఅర్  లాగా దమ్ము, ధైర్యం ఉండాలని పిలుపునిచ్చారు. మండలంలోని బీఆర్ఎస్ చేసిన అభివృధిని చుసి ప్రతి గ్రామంలో ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. గడచిన నాలుగేళ్లలో నా భార్యా పిల్లలు తీసుకుని కనీసం సినిమాకు కూడా పోలే.. పట్టు మని నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ కేవలం ఇద్దరి కడుపు నొప్పిని ప్రజలకు అంటగడతారా..? మీకు కేసీఅర్ గారు ఎం తక్కువ చేశారు..?

ఇది కూడా చదవండి:- దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌: మంత్రి పువ్వాడ

మీ రాజీనామా పత్రంలో నాకు సహకరించిన బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు అని రాశారు.. పార్టీ మీకు సహకరిస్తే ఎవరైనా రాజీనామా చేస్తారా..? సహకరించకపోతే కదా రాజీనామా చేయాలన్నారు. ఇదేం వింత పోకడనో అర్దం కాలేదు.. పార్టీలో మీకు ఇన్ని అవకాశాలు కల్పించి, ఓడిపోయినప్పుటికి నిన్ను మంత్రిని చేసిన కేసీఅర్ గారు నాడు దేవుడు అయ్యాడు.. పార్టీ టికెట్ ఇవ్వకపోయే సరికి దయ్యం అయ్యాడా..? అని ప్రశ్నించారు. ఇలాంటి వారిని ప్రజలు తరిమి కొట్టాలి.. ఇన్నాళ్లు ఏమైపోయారు మీరంతా.. ఇప్పుడు దండాలు పెట్టుకుంటు వస్తున్నారు. వారిని ప్రజా క్షేత్రం నుండి తరిమికొట్టాలన్నారు. మనం బీఆర్ఎస్ పార్టీని కలిసి కట్టుగా జట్టు కట్టి కేసీఅర్ హ్యాట్రిక్ కొట్టే విధంగా పని చేసి గెలిపించుకోవాలి.