గ్రానైట్, అనుబంధ చిన్న తరహా పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి పువ్వాడ
గ్రానైట్, అనుబంధ చిన్న తరహా పరిశ్రమల సమస్యలను పరిష్కరించండి : మంత్రి పువ్వాడ
★ గ్రానైట్ పరిశ్రమల సమస్యలపై మంత్రి పువ్వాడ,
ఎంపీ నామ సమీక్ష
గ్రానైట్ పరిశ్రమల సంబంధిత సమస్యలు పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గ్రానైట్ సంఘాల ప్రతినిధులతో సమీక్షించారు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశమై పలు సమస్యలపై చర్చించారు
గ్రానైట్ చిన్న స్థాయి పరిశ్రమలకు గతంలో మాదిరిగా రాయల్టీ మీద ఉన్న 40 శాతం రాయితీ, అదే విధంగా టన్నేజీ విధానంతో నష్టం వస్తున్న నేపథ్యంలో ఆ విధానాన్ని అమలును నిలిపివేయాలని గ్రానైట్ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
All so read:- దిగుడా..? దూకుడా..? పొంగులేటి దారేటు..
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారంకు కృషి చేస్తామని, గ్రానైట్ చిన్నతరహా పరిశమ్రలకు భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. స్లాబ్ సిస్టమ్ కొరకు ప్రయత్నం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ రొనాల్డ్ రోస్, తెరాస రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర, గ్రానైట్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు
allso read :- కూసుమంచి మండలాన్ని వణికిస్తున్న కరోనా