Telugu News

హసన్ పర్తి-కరీంనగర్ రైల్వే లైన్ ను తక్షణమే మంజూరు చేయండి : బండిసంజయ్

ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించండి

0

***హసన్ పర్తి-కరీంనగర్ రైల్వే లైన్ ను తక్షణమే మంజూరు చేయండి : బండిసంజయ్
***ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించండి
***రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు బండి సంజయ్ వినతి
***పలు రైళ్ల సర్వీసులను కొనసాగించాలని ప్రతిపాదన
***(కరీంనగర్-విజయంన్యూస్):-
హసన్ పర్తి నుండి హుజూరాబాద్ మీదుగా కరీంనగర్ రైల్వే లైన్ ను వెంటనే మంజూరు చేయడంతోపాటు ఈ బడ్జెట్ లోనే తగిన నిధులు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈరోజు రైల్వే మంత్రిని కలిసిన బండి సంజయ్ ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు, చేతివ్రుత్తుల వారు సహా సామాన్య ప్రజలు నిత్యం ప్రయాణాలు సాగిస్తునంటారని, హసన్ ఫర్తి- కరీంనగర్ రైల్వే లైన్ ఏర్పాటైతే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

also read :-తెలంగాణాలో పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాల లీక్

దీంతోపాటు రైల్వే శాఖకు ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. హసన్ పర్తి- కరీంనగర్ రైల్వే లైన్ మంజూరు విషయంపై ఇప్పటికే పలుమార్లు రైల్వే శాఖ ద్రుష్టికి తీసుకురావడంతోపాటు రైల్వే బోర్డు చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన విషయాన్ని బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కొత్త రైల్వే లైన్ సాధ్యాసాధ్యాలపై గతంలోనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సర్వే నిర్వహించి 2013లోనే రైల్వే బోర్డుకు నివేదిక పంపారని తెలిపారు.

• ఆ నివేదిక ప్రకారం ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం రూ.464 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారని పేర్కొన్నారు. హసన్ పర్తి- కరీంనగర్ రైల్వే లైన్ పూర్తయితే కరీంనగర్ తోపాటు పొరుగు ప్రాంతాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త రైల్వే లైన్ ను మంజూరు చేయడంతోపాటు తగిన నిధులు కేటాయించాలని కోరారు.

• అట్లాగే దీంతోపాటు కొత్త రైళ్ల సర్వీసులను ప్రవేశపెట్టాలని కోరడంతోపాటు కోవిడ్ కారణంగా నిలిచిపోయిన రైళ్ల సర్వీసులను పునరుద్దరించాలని కోరారు.

also read :-★ రాజమండ్రిలో మంత్రి పువ్వాడ వివాహ వార్షికోత్సవ వేడుకలు

వాటిలోని ముఖ్యాంశాలు…
• అందులో భాగంగా తిరుపతి –కరీంనగర్- తిరుపతి (12762/61) రైలును ప్రతిరోజు నడిపేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఈ ట్రైన్ కు ‘శ్రీ రాజ రాజేశ్వర సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్’ గా నామకరణం చేయాలని బండి సంజయ్ సూచించారు. కరీంనగర్ నుండి పెద్దపల్లి – జమ్మికుంట – కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు కొత్త మెము ఎక్స్‌ ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని కోరారు.

also read;-ప్రజల ప్రేమాభిమానాలే శాశ్వతం:మాజీ ఎంపీ పొంగులేటి

• కోవిడ్ కారణంగా నిలిపివేసిన కరీంనగర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ (11205/06 వయా నిజామాబాద్) రైలును వెంటనే పునరుద్ధరించాలని. ఈ రైలులో అత్యధికంగా ప్రజలు ప్రయాణిస్తుంటారని… 112.5% ఆక్యుపెన్సీతో విజయవంతంగా నడవడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. దీంతోపాటు కరోనా కారణంగా నిలిపివేసిన కరీంనగర్ నుండి లోకమాన్య తిలక్ టెర్మినస్ రైలు సేవలను తక్షణమే పునరుద్దరించాలి.

• నిజామాబాద్ నుండి కరీంనగర్ వీదుగా సిర్పూర్ టౌన్ వరకు (77255/56) DEMU ప్యాసింజర్‌(పుష్ ఫుల్) రైలును పునరుద్ధరించాలని బండి సంజయ్ ఈ రైలును మోర్తాడ్ నుండి నిజామాబాద్ వరకు విద్యుదీకరించి MEMU ప్యాసింజర్‌గా మార్చాలని ప్రతిపాదించారు.

• తెలంగాణలో 4వ అతిపెద్ద నగరం, స్మార్ట్ సిటీగానున్న కరీంనగర్ అభివ్రుద్ది చెందిన నేపథ్యంలో కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో 2వ ప్లాట్‌ఫారంను ఏర్పాటు చేయడంతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మించాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు.

• తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు లేనందున దీనిని ద్రుష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ నుండి నిజామాబాద్ – కరీంనగర్ మీదుగా ఢిల్లీ, హరిద్వార్ వరకు కొత్తగా తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.