Telugu News

ద్రాక్ష గుడ్లు పెడుతున్న కేరళ కోడి…….

ద్రాక్షపండు సైజులో కోడిగుడ్లు.. ఎప్పుడైనా చూశారా? లేదంటే.. కేరళకు వెళ్లాల్సిందే.......

0

ద్రాక్ష గుడ్లు పెడుతున్న కేరళ కోడి…….
ద్రాక్షపండు సైజులో కోడిగుడ్లు.. ఎప్పుడైనా చూశారా? లేదంటే.. కేరళకు వెళ్లాల్సిందే…….

(చండ్రుగొండ- విజయంన్యూస్ ):-

కేరళ లో ని మలప్పురంలోని ఏఆర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన సమద్‌ ఇంట్లోని కోడిపెట్ట ద్రాక్షపండ్ల సైజులో గుడ్లు పెడుతోంది. అయిదేళ్ల వయసున్న ఈ కోడిపెట్ట పెడుతున్న గుడ్లలో తెల్లసొన మాత్రమే ఉండి, పచ్చసొన లేకపోవడం మరో విశేషం…..
కొన్నిరోజుల క్రితం వరకు మామూలు సైజులోనే గుడ్లను పెట్టేదని సమద్‌ చెప్పారు. ‘మా ఇంట్లో ఉన్న మిగతా కోళ్లకు పెట్టే ఆహారాన్నే ఈ కోడికీ పెడతాం. అయినా ఇలా వింత సైజులో ఇప్పటిదాకా 9 గుడ్లు పెట్టింది’ అని వివరించారు. ఈ చిన్నగుడ్ల ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. వాటిని చూసేందుకు చాలామంది సమద్‌ ఇంటికి వస్తున్నారు.

also read :-భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ జాగిలం రీనా మృతి.,…